అనంతపురం జిల్లాలో పోలీసులు వర్సెస్ జేసీ వివాదం రచ్చ రచ్చ అవుతోంది. ప్రబోధానందస్వామి ఆశ్రమం మూసివేయించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన జేసీ… ఈ వ్యవహారంలో పోలీసులు నిర్వీర్యమమైపోయారంటూ ఆరోపించారు. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, పోలీసులు ఉన్నట్టా చచ్చిపోయినట్లా అంటూ వ్యాఖ్యానింాచరు జేసీ. అంతే కాదు…మీరు ఇంతే అనేలా హిజ్రాలతో నృత్యాలు చేయించారు. పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అసోషియేషన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై నోరు అదుపుతప్పితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థను కించపర్చేలా మాట్లాడితే… నాలుకలు తెగ్గోస్తామంటూ ఖద్దరు నేతలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు .
పోలీసులనుద్దేశించి తాను చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఎంపీ జేసీ. తాను ఉపయోగించిన పదం అన్‌పార్లమెంటరీ వర్డ్ అయితే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆ పదం తప్పో కాదో చెప్పాలంటూ మీడియా ప్రతినిధులనే ప్రశ్నించారు.
తాను ఉపయోగించిన పదం తప్పని చెబితే… గోరంట్ల సీఐ మాధవ్‌కు పాదాభివందనం చేసి క్షమాపణ వేడుకుంటానన్నారు ఎంపీ జేసీ. అన్‌పార్లమెంటరీ వర్డ్ అయితే క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు .పోలీసులకు కౌంటర్ గా జేసీ తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభోదానంద స్వామి ఘటనలో ప్రాణభయంతో..పోలీసులతో పాటు నేను కూడా కొజ్జాలాగానే పరిగెత్తానన్నారు. ఎంపీ జేసీ. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో సింహంలా బతికాను.. నేను కొజ్జాలాగా పరిగెత్తానన్న భావన ప్రజల్లో ఉందన్నారు. కొజ్జా అనే మాట తప్పయితే క్షమాపణ చెబుతాననన్నారు. ఈనెల 25 వరకు అనంతపురంలోనే ఉంటా .. సీఐ మాధవ్ నేరుగా నాతో మాట్లాడేందుకు రావొచ్చని సవాల్ చేశారు. సీఐ మాధవ్‌పై ఉన్నతాధికారులుక ఫిర్యాదు చేస్తానన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులపై దురుసుగా మాట్లాడటం.. తర్వాత కవర్ చేసుకోవడం ఎప్పుడూ జరిగేదే. గతంలో విశాఖ విమానాశ్రయంలో జేసీ ప్రింటర్ పగులగొట్టి.. నో ఫ్లై లిస్ట్ లోకి కూడా చేరాడు. ఇప్పుడు ప్రబోధానంద విషయంలో.. మరింత హద్దులు దాటిపోయారు. కానీ పోలీసులు తిరగబడుతున్నారు. ఇప్పుడీ వివాదాన్ని మళ్లీ ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోతారేమో చూడాలి…!