భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపైనా… తన మార్క్ సందేహాలు లేవనెత్తాలని చేసిన ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. చంద్రబాబు అమెరికా పర్యటన సొంతంగా వెళ్తున్నారని.. ఐక్యరాజ్య సమితి పిలవలేదన్నట్లుగా ఆయన… విమర్శలు చేశారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి.. చెప్పేదొకటని చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని సవాల్ చేశారు. చంద్రబాబు వెళ్తున్న ఐరాసలో ప్రసంగానికి కాదని.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ.. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రెచ్చిపోయారు.
చంద్రబాబు విమానం ఎక్కే లోపే ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీడియా కూడా నిజనిజాలు తెలుసుకోవాలని తన మార్క్ జ్ఞానబోధ కూడా చేాశారు. న్యూయార్క్‌లో సదస్సు పెట్టినంత మాత్రాన.. ఐక్యరాజ్యసమితిలో సమావేశం పెట్టినట్లా అంటూ.. వెటకారం కూడా ఆడారు. వరల్డ్ ఎకనామిక్ వారు న్యూయార్క్‌లో పెడుతున్న రెండో సమావేశమే అదని చెప్పుకొచ్చారు. ఇలా జీవీఎల్ విమర్శలు ముగించేయగానే.. అటు.. ఏపీ సీఎంవో ఆయన అజ్ఞానాన్ని..బట్టబయలు చేసింది. ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్ని ఏపీ సీఎంవో మీడియాకు విడుదల చేసింది. ఆహ్వానంలో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు రావాలని స్పష్గంగా చంద్రబాబుకు ఆహ్వానం పంపింది. ఐ.రా.స పర్యావరణ విభాగం నుంచి గత నెల 22న చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఐ.రా.స ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సాల్హిమ్ పేరుతో సీఎంకు ఆహ్వానం వచ్చింది. చంద్రబాబు స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతారని లేఖలో ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశానికి, ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు తేడా తెలియనంత.. అజ్ఞానంలో జీవీఎల్ ఉన్నారని అనుకోలేం. కానీ పీడీ అకౌంట్ల తరహాలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తే.. చాలని అనుకున్నట్లున్నారు. అసలు జీవీఎల్ అంటే.. జోకర్ అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు… దానికి తగ్గట్లుగానే ఆయన ఇలాంటి విమర్శలు చేస్తూ దొరికిపోతున్నారు. నిజానికి ఐక్యరాజ్య సమితి నుంచే ఆహ్వానం అధికారికంగా అందిందని.. ఎప్పుడో మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. స్వయంగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. అయినా జీవీఎల్ తనకు మాత్రమే చేతనైన రాజకీయాన్ని చేయబోయి బోర్లా పడ్డారు.