ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తే.. ఓ మానియా కనిపించింది. భారతీయులంతా.. ఆయనకు స్వాగతం చెప్పడానికి పోటీ పడ్డారు. సమావేశానికి పరుగులు పెట్టారు. మళ్లీ ఇటీవల .. అసిఫా ఘటన జరిగినప్పుడు అమెరికా వెళ్తే స్వాగతానికి బదులు నిరసనలు ఎదురొచ్చాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా వెళ్లిన ప్రతి సారి… ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలుకుతూనే ఉన్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితిలో … జీరో బడ్జెట్ సాగుపై ప్రసంగించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో.. ప్రవాసాంధ్రులు.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలోని నార్త్ ఈస్ట్ తెలుగు కమ్యూనిటీ .. ఎన్నారై టీడీపీతో కలిసి ఏర్పాటు ప్రోగ్రాంను నిర్వహించింది. న్యూజెర్సీలోని ఎన్జేఐటీ వెల్నెస్ అండ్ ఈవెంట్స్ సెంటర్ కు.. అమెరికా నలు మూలల నుంచి ప్రవాసాంధ్రులు తరలి వచ్చారు. . దాదాపుగా నాలుగు వేల మందికి హాజరయ్యారు. ఇంత మంది వస్తారని.. ఎన్నారై టీడీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు. ఓ రాజకీయ నాయకుడి కార్యక్రమానికి ఇంత మంది హాజరు కావడం అనేది చాలా అరుదైన విషయం.
భారత్ నుండి అమెరికాకు..అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు వస్తారు. అయితే… మోడీ మినహా..మరే రాజకీయ నేత వచ్చినా పెద్దగా పట్టించుకునే వారు ఉండరు. ఇటీవలి కాలంలో… కొంత మంది నేతలు.. ప్రవాసాంధ్రులను ఆకట్టుకునేందుకు.. ప్రత్యేకంగా.. ప్రచారం చేసుకుని అమెరికా వచ్చి ఈవెంట్ల తరహాలో కార్యక్రమం నిర్వహిద్దామని చూసి.. ఆదరణ లేక.. క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రికి మాత్రం.. అమెరికాలో అనూహ్యమైన క్రేజ్ వస్తోంది. విమానాశ్రయం దగ్గరే… కొన్ని వందల మంది స్వాగతం చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా “మళ్లీ నువ్వే రావాలి” స్టిక్కర్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. సాధారణంగా ఎన్నికల ముందు.. జిల్లాల పర్యటనలకు వెళ్తే… కార్యకర్తలు అంత హడావుడి చేస్తారు. కానీ.. అమెరికాలో మాత్రం.. ప్రవాసాంధ్రులు… ఎన్నికలతో సంబంధం లేకుండా.. ఏపీ ముఖ్యమంత్రి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు.
గతంలో చంద్రబాబు పలుమార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఊహించని స్థాయిలో ఎక్కువగా ప్రవాసాంధ్రులు చంద్రబాబుతో సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో పలు కీలక సమావేశాలు నిర్వహిచనున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పర్యావరణ విభాగం ఏర్పాటు చేసిన “సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు” అనే అంశంపై ప్రసంగిస్తారు. ఆ తర్వాత పలువురు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు జరుపుతారు.
Meet & Greet with Shri Nara Chandrababu Naidu @ncbn in New Jersey , USA is a huge hit with over 4,000 crowd at the venue
Video from the event hall #NRITDP @naralokesh pic.twitter.com/PiW26npsZK
— Telugu360 (@Telugu360) September 24, 2018