‘‘నా వయసు 59. కాని మనసులో 25 ఏళ్ళే అనుకుంటా’’ అన్నారు నాగార్జున. నానితో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’ రిలీజ్ సందరర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తానింకా చిన్న పిల్లాడినే అన్నట్టు చెప్పారు. పెద్ద కొడుకు నాగచైతన్య కంటే చిన్నోడినే అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే… ఒక్క విషయంలో మాత్రం పెద్దోడిగా ఫీలవుతానని చెప్పారు. అదెప్పుడో తెలుసా? కుమారులకు సినిమా విషయంలో సలహాలు ఇచ్చేటప్పుడు! ఈరోజు ఇంటర్వ్యూలో అఖిల్ హిందీ డెబ్యూ గురించి చర్చ వచ్చింది. అప్పుడు నాగార్జున తెలుగు డెబ్యూ గురించి మాట్లాడారు. తెలుగులో తొలి సినిమా చేసేటప్పుడు అఖిల్ తొందరపడ్డాడని అభిప్రాయడ్డారు. కొన్నిసార్లు పెద్దలు చెప్పేది వినాలని, ఈ ఒక్క విషయంలో నేను పెద్దోడిగా ఫీలవుతానని నవ్వేశారు. ‘‘కరణ్ జోహార్ (హిందీ దర్శక నిర్మాత)కి అఖిల్ అంటే చాలా ఇష్టం. అఖిల్‌ని హిందీలో నేను ఇంట్రడ్యూస్ చేస్తానని రెండుసార్లు చెప్పాడు. అప్పుడు నేను ‘తొందరపడొద్దు. తెలుగులో అఖిల్ నటించిన సినిమా హిట్ అయితే… దాన్ని హిందీలో నువ్ రీమేక్ చేయ్’ అని చెప్పా. నేను ‘శివ’ అలాగే చేశా. అఖిల్ ఓసారి తొందరపడ్డాడు. కొన్నిసార్లు పెద్దోళ్లు చెప్పే మాటలు వినాలి’’ అని నాగార్జున చెప్పారు. ‘అఖిల్’ సినిమా విషయంలో చిన్న కుమారుడు తన మాట వినలేదని పరోక్షంగా ప్రస్తావించారు. అప్పట్లో అఖిల్ ప్రవర్తనపై చాలా వార్తలొచ్చాయి. అవన్నీ నిజమని తాజా నాగార్జున మాటలతో అనుకోవాల్సి వస్తుంది.