రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటి వరకూ రాలేదు. దసరాకి ఫస్ట్ లుక్, టైటిల్ బయటకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఏ క్లూ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. కనీసం టైటిల్ పై ఎలాంటి క్లూ లూ దొరకలేదు. తొలిసారి ఓ టైటిల్ బయటకు వచ్చింది. అదే.. `స్టేట్‌రౌడీ`. ఈ సినిమాకి `స్టేట్ రౌడీ` అనే పేరు పెట్టడానికి బోయపాటి ఫిక్సయినట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా నటించిన `స్టేట్ రౌడీ` అప్పట్లో మాస్‌ని ఆకట్టుకుంది. పాటలన్నీ హిట్టే. చిరు పాటల్ని వాడుకున్న చరణ్…. ఇంత వరకూ చిరు టైటిళ్లపై దృష్టి పెట్టలేదు. తొలిసారి.. ఆ లోటు తీరబోతోందన్నమాట. దసరా సందర్భంగా అక్టోబరు 19న ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతోంది చిత్రబృందం. ఈలోగా టైటిల్‌ని ప్రకటిస్తారా, లేదంటే… అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగిస్తారా? అనేది తేలాలి.