బయటకు తెలియడం లేదు కానీ… తెలంగాణ రాష్ట్ర సమితిలో… ముఖ్యంగా.. కేసీఆర్ ఫ్యామిలీలో.. తేడా వ్యవహారం ఏదో జరుగుతోంది. ముఖ్యంగా హరీష్ రావు వైపు నుంచి… ఏదో ముప్పు ఉందన్న భయం.. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎక్కువగా ఉన్నట్లు ఉంది. హరీష్ రావు.. ఎక్కడా… టీఆర్ఎస్ పార్టీపై కానీ…కేసీఆర్ పై కానీ..కేటీఆర్‌పై కానీ.. వ్యతిరేక మాట మాట్లాడటం లేదు. వీలైనంతగా.. తన విధేయతను చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల తొలిప్రచార సభను హరీష్‌కే అప్పగించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి… ఆయనను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. హరీష్ రావు చేసిన ప్రకటన తర్వాత… గ్యాప్ మరింత పెరిగిపోయిందని.. టీఆర్ఎస్ వర్గాలు… చెప్పుకుంటున్నాయి. దానికి కారణం… టీఆర్ఎస్ అనుకూల పత్రికల్లో.. ఎక్కడా హరీష్ రావుకు సంబంధించిన వార్తలే రాకపోవడం.
కేసీఆర్ కుటుంబానికి నమస్తే తెలంగాణ, టీ న్యూన్ చానల్స్ ఉన్నాయి. ఇక టీఆర్ఎస్కు అనుబంధ పత్రికలుగా.. ఇతర పత్రికలు ఉన్నాయి. ఒక్క నమస్తేలో మాత్రమే కాదు.. టీఆర్ఎస్కు సన్నిహితంగా ఉంటాయనుకున్న పత్రికల్లో కూడా… హరీష్ రావుకు ఏ మాత్రం కవరేజీ రావడం లేదు. దానికి సంబంధించి పై నుంచి స్పష్టమైన ఆదేసాలు వచ్చినట్లు ఆయన పత్రికల సిబ్బంది అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. హరీష్ .. ఎవరికీ తెలియకుండా.. తన రాజకీయ జీవితంలో ఎదైనా పెద్ద స్టెప్ వేయాలని నిర్ణయించుకున్నారా..? అది తెలిసే.. కేసీఆర్ దూరం పెట్టచడం ప్రారంభించారా..? అన్న అనుమానాలు టీఆర్ఎస్లో ప్రారంభమయ్యాయి. దీనికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. అదేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో హరీష్‌రావుకు సిద్దిపేట బీఫాం ఇవ్వబోవడం లేదు. అక్కడ ఎవర్నీ నిలబెడతారో కానీ… హరీష్‌ను మెదక్ ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.
హరీష్‌పై.. కేసీఆర్ ఆగ్రహంతో ఉండటానికి కారణం.. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించమేనని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. అది కేసీఆర్ మార్క్ రాజకీయమే. వరుస ఓటములు ఎదురై.. పార్టీలో తిరుగుబాటు వచ్చినప్పుడు… కేసీఆర్ ఇలాంటి .. అస్త్ర సన్యాస వ్యూహమే అమలు చేస్తారు. తాను రాజీనామా చేస్తానని ప్రకటిస్తారు. అలా ప్రకటించినప్పుడు.. తిరుగుబాటు నేతలు కాక.. ఇతరులు… వచ్చి … కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తారు. అలాగే.. ఇప్పుడు హరీష్ రావు కూడా.. రాజకీయాల నుంచి వైదొలిగుతానన్నట్లుగా ప్రకటించారు. కానీ ఒక్క రోజుకే.. అనూహ్యంగా దాన్ని భావోద్వేగ ఖాతాలో కలిపేశారు. కానీ కేసీఆర్ మాత్ర సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. హరీష్‌ను… దూరం పెట్టేశారు. తన పత్రికల్లో కూడా మీడియా కవరేజీ రాకుండా ఆదేశాలిచ్చారంటే.. విషయం చాలా సీరియస్సేనని అర్థం చేసుకోవచ్చు.