సినిమా షూటింగ్ సంగతులు పక్కన పెడితే… సినిమా షూటింగ్ కోసమని వెళ్ళిన ప్రదేశాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సరదా సరదా పనులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొందరు విమర్శలు కూడా చేస్తున్నారనుకోండి! ఇటీవల ఏనుగు దంతాలపై కూర్చున్న ఫొటోను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది? నెటిజన్లు రెచ్చిపోయారు. ట్రోలింగ్‌తో తమ తడాఖా చూపించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బెల్లంకొండ ఇంకో ఫొటో పోస్ట్ చేశారు. అదిగో… పైన చూస్తున్నదే. బెల్లంకొండ భుజాలపై కాజల్ అగర్వాల్ కూర్చున్న ఫొటో. దీనిపైనా సెటైర్లు చాలా పడ్డాయి.
‘పెళ్లి చేసుకోండ్రా బాబూ… ఎంత క్యూట్‌గా వున్నారో’
– అని కామెంట్ చేశాడో ప్రేక్షకుడు.
‘అడ్వాంటేజెస్ ఆఫ్ రిచ్ డాడ్’
– అని మరొకరు కామెంట్ చేశారు.
‘భయ్యా.. నువ్వు షూటింగ్ చేస్తున్నావో? మా కాజల్‌తో ఫొటోషూట్లు చేస్తున్నావో? రోజూ చూసి తట్టుకోలేకపోతున్నా’
– అని ఇంకొకరు
ఈ విధంగా చాలామంది ఈ ఫొటోపై స్పందించారు.
ఇంతకీ ఫొటో ఎక్కడ దిగిందో చెప్పలేదు కదూ?! కంబోడియాలో! తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంబోడియాలోని అంగోర్ వాట్ టెంపుల్లో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ మధ్యలో ఇదిగో ఇలా ఫొటోలు దిగారు.