Savyasachi Teaser Review
సవ్యసాచి అనే టైటిల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో…. ఆ కాన్సెప్ట్ ఏమిటన్నది చూచాయిగా తెలిసిపోయింది. నాగచైతన్య ఎడమ చేయి.. తన మాట వినకపోతే.. ఎలా ఉంటుందన్న గమ్మత్తైన కాన్సెప్ట్ ఈ కథ. నాగచైతన్య – చందూ మొండేటి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రమిది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషించాడు. టీజర్ విడుదలైంది. సాధారణంగా రక్తం పంచుకుని పుడితే, అన్నదమ్ములంటారు – ఒకేరక్తం ఒకే శరీరంతో పుడితే అద్భుతం అంటారు – అంటూ సాగే నాగచైతన్య డైలాగ్‌తో టీజర్ కట్ చేశారు. టీజరంతా… యాక్షన్ హంగామానే. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఈ యాక్షన్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. మాధవన్ ఎక్కడ, ఎక్కడ అని ఎదురు చూసిన కళ్లకు `లాస్ట్ పంచ్`లా మెరిశాడు మాధవన్. ఆ షాట్ కూడా మాధవన్‌లో రెండు కోణాలున్నాయన్న విషయాన్ని చూచాయిగా చెప్పేసింది. ఓ యాక్షన్ థ్రిల్లర్‌ని చూడబోతున్నారని ముందుగా ప్రిపేర్ చేసేశాడు దర్శకుడు. యాక్షన్ప్రియులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గమ్మత్తైన కాన్సెప్టులు, స్క్రీన్ ప్లే ట్విస్టులతో సాగితే గనుక… `శైలజా రెడ్డి అల్లుడు`తో బాకీ పడిన హిట్‌ని.. చైతూ ఈ సినిమాతో తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.