‘గీత గోవిందం’తో టాప్ లిస్టులోకి చేరిపోయాడు పరశురామ్. రూ.100 కోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడు కాబట్టి.. డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. పరశురామ్ పారితోషికం రూ.6 కోట్ల వరకూ చేరింది. గీతా ఆర్ట్స్ కూడా పరశురామ్‌తో వెంటనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసింది. మరోవైపు మైత్రీ మూవీస్సంస్థ కూడా పరశురామ్‌కి అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్లతో పరశురామ్‌ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పరశురామ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ప్రస్తుతం తన దగ్గర లైన్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని కథగా మార్చడానికి సమయం పడుతుంది. అందుకే… తొందరపడి ఏ సినిమాకీ సంతకం చేయలేదు. పరశురామ్ కొంతకాలం విరామం తీసుకుని అప్పుడు కొత్త కథ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాడట. అయితే అల్లు అర్జున్, లేదంటే మహేష్‌బాబు… పరశురామ్ మైండ్ లో ఉన్న హీరోలు వీళ్లే. తన కథ వీళ్లలో ఒకరికి సెట్టయ్యే ఛాన్సుందని భావిస్తున్నాడు. వీరిద్దరూ తనకు దొరకాలంటే కాస్త టైమ్పడుతుంది. అందుకే.. కథ, స్క్రిప్టు విషయంలో తొందరేం లేదు. కొంత కాలం కుటుంబంతో గడిపి, ఆరోగ్యం కుదుటపడిన తరవాత.. కొత్తసినిమా కోసం పెన్ను పట్టుకుంటాడట. అప్పటి వరకూ హాలీడే మూడ్‌లో ఉంటాడన్నమాట.