సినిమాలు.. ఎదిగీ ఎదగని మనసులపై ఎంత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఇద్దరు పదో తరగతి విద్యార్థుల ఘటనను చూస్తే తెలిసిపోతుంది. జగిత్యాలకు చెందిన రవితేజ, మహేందర్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు వేరువేరు అమ్మాయిలను ప్రేమించారు. అది వన్ సైడ్ లవ్. వారి చెప్పిన మాటలను… ఆ అమ్మాయిలు పట్టించుకోలేదు. దాంతో.. ఆ అమ్మాయిలు తమను మోసం చేశారన్న భావనతో.. చచ్చిపోవాలనుకున్నారు. మద్యం బాటిళ్లు .. బాటిళ్లు పెట్రోల్‌లో నింపుకుని.. ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగారు. మత్తులో పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటన జగిత్యాలలో కలకలం రేగింది. హత్య అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. కానీ వారి సెల్ ఫోన్లు, వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించగానే అసలేం జరిగిందో తెలిపోయింది.
విద్యార్థులిద్దూర వేర్వేరు అమ్మాయిలను ప్రేమించారు. విషయాన్ని చాటింగ్‌లలో మాట్లాడుకున్నారు. అమ్మాయిలు పట్టించుకోవడం లేదని… నిర్ణయించుకున్నారు. అప్పుడే వారి మధ్య ఆర్.ఎక్స్ 100 సినిమా గురించి చర్చ జరిగింది. అందులో హీరో.. హీరోయిజంతో చచ్చిపోయాడని.. మనం కూడా అలాగే చచ్చిపోదామని చర్చించుకున్నారు. ఇక మద్యం తాగడం కూడా హీరోయిజంగానే భావించారు. ఆ సినిమా స్ఫూర్తితో ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ .. కాల్ డేటా పోలీసులు విశ్లేషిస్తున్నారు.
పోలీసులు వారిద్దరికీ స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. నీలి చిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డారని గుర్తించారు. వారిద్దరూ తరచూ స్కూల్‌కు దగ్గరలో ఉన్న మిషన్ కాంపౌండ్‌లోని చెట్ల మధ్య ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లా వద్దకు వెళ్లేవారు. అక్కడే సెల్ఫోన్లలో బూతు బొమ్మలు చూస్తూ మద్యం తాగడం లాంటి చెడు అలవాట్లను నేర్చుకున్నారు. తాము చనిపోవాలనుకున్న రోజు కూడా.. అక్కడికే వెళ్లారు. అక్కడి వెళ్లే ముందు బాటిల్లో పెట్రోలు తీసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంటలు చెలరేగడాన్ని స్థానికులు దూరం నుంచి గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారు.