‘అరవింద సమేత వీర రాఘవ’ – ఈ సినిమాపై అటు అభిమానులకు ఇటు ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు.
వాటన్నింటినీ నివృత్తి చేసే ప్రయత్నం చేసేశాడు ఎన్టీఆర్. ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ స్పీచ్ పూర్తిగా ఎమోషనల్‌గా సాగినా… తానేం మాట్లాడాలనుకున్నాడో స్పష్టంగా మాట్లాడేశాడు. ఈ సినిమాపై కలుగుతున్న కొన్ని అనుమనాల్ని పటా పంచలు చేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అందించాడు.
అనుమానం 1: అసలు ఆ టైటిలేంటి?? ఎన్టీఆర్ ఇమేజ్‌కి సరితూగుతుందా?
ఎన్టీఆర్ సమాధానం: అరవింద సమేత టైటిల్ పెట్టినప్పుడు నా ఇమేజ్‌కి సరిపోతుందా? అని చాలామంది అనుకున్నారు. ఓ మగాడి పేరు పక్కన ఆడదాని పేరు కంటే బలం ఉంటుందా?
అనుమానం 2: అసలు ఆ పాటలేంటి? ఎన్టీఆర్ సినిమాలో ఇంతటి ఎమోషనల్ గీతాలా? డాన్స్ చేయడానికి అవకాశమే లేకుండా చేశారే..!
ఎన్టీఆర్ సమాధానం: నటనలో డాన్స్ ఓ భాగం తప్ప – డాన్స్‌లో భాగం నటన కాదు. నేను ముందు నటుడ్ని. ఆ తరవాతే డాన్సర్‌ని
అభిమానుల ప్రశ్న: తమన్ సంగీత మైనస్ అయ్యిందా?
ఎన్టీఆర్ క్లియరెన్స్: తమన్ ఈ చిత్రానికి వాయిద్యాలు అందించలేదు. తన ప్రాణం పెట్టాడు. తమన్ కాకుండా మరో సంగీత దర్శకుడ్ని ఊహించలేను. ఈ సినిమాకేం కావాలో అదే అందించాడు. తన పాటలన్నీ సన్నివేశం, సందేశం మోసుకెళ్తాయి.
ఇలా దాదాపుగా వినిపిస్తున్న అనుమానాలకు తన సమాధానాలతో క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్. ఈ స్పీచుతో ‘ఈ సినిమాలో మాస్ బీట్లు లేవు’ అనుకున్నవారికీ, టైటిల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్లకూ సమాధానాలు అందేసినట్టే.