తన ప్రతీ సినిమాలోనూ ఓ కథానాయికని `సైడ్ క్యారెక్టర్`లా చూపించడం త్రివిక్రమ్‌కి అలవాటే. త్రివిక్రమ్ సినిమా కాబట్టి… ఎలాంటి పాత్రనైనా పోషించడానికి కథానాయికలు సిద్ధంగా ఉంటారు. చిన్న సినిమాల్లో హీరోయిన్గా చలామణీ అవుతూ, అడపా దడపా విజయాల్ని అందుకుంటున్న ఈషారెబ్బాకి ఇప్పుడ ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఛాన్స్ దక్కింది. ఓ కీలకమైన పాత్రలో ఈషా కనిపించబోతోంది. ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చినందుకు ఈషా కూడా ఆనందంలో తేలియాడుతోంది. అరవింద సమేత ఆడియో ఫంక్షన్లో నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడిన ఒకే ఒక్క స్పీకర్ కూడా ఈషానే. ఆమె ఆనందం ఆ స్థాయిలో ఉంది.
అయితే… ఈ ఆనందానికి నీళ్లు చల్లే విషయం ఒకటి తెలిసింది. ఇందులో ఈషా పాత్రకు అంత స్కోప్ లేదట. త్రివిక్రమ్ కథగా రాసుకున్నప్పుడు ఈషా పాత్ర బాగానే ఉన్నా, ఆ తరవాత జరిగిన మార్పుల్లో ఈషా పాత్ర బాగా కుదించుకుపోయిందని టాక్. షూటింగ్‌కి వెళ్లకముదే ఈషా సన్నివేశాలకు బాగా కత్తెర్లు పడిపోయాయని టాక్. 15 రోజుల కాల్షీట్లో ఈషాపై తెరకెక్కించింది నాలుగు సన్నివేశాలే అని, ఈ పాత్రకు అర్థాంతరంగా ‘శుభం’ కార్డు వేయడంతో తగిన ప్రాధాన్యం సంతరించుకోలేకపోయిందని తెలుస్తోంది. చిన్నదో, పెద్దదో.. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్సొచ్చింది. ఈ సినిమా పేరుతో కొంత గుర్తింపుని తన ఖాతాలో వేసుకోవొచ్చు. ‘అత్తారింటికి దారేది’ పేరు చెప్పి ప్రణీత రెండు మూడు సినిమాల్ని తన బ్యాగులో వేసుకోగలిగింది. ఈషాకీ అలాంటి ఛాన్సులొస్తాయేమో చూడాలి.