జీవీఎల్ నరసింహారావు… భారతీయ జోకర్ల పార్టీలో అతిపెద్ద జోకరని… తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూంటారు. కానీ ఆయన ఈ విమర్శలను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోరు. ఓ రకంగాచెప్పాలంటే పట్టించుకోరు. ఆయన ఆరోపణలు ఆయనే చేస్తూనే పోతూంటారు. ఆయన ఆయన చేస్తూ పోయిన ఆరోపణలు అప్పుడప్పుడు.. అయలోని మరో కోణాన్ని ఆయనకుసంబంధం లేకుండానే ఆవిష్కరిస్తూ ఉంటాయి. అందుకే ఒకటి నిన్న ఢిల్లీలో జరిగింది. అంతే.. దాన్ని పట్టుకుని టీడీపీ సోషల్ మీడియా… ట్రెండ్ సెట్టింగ్ అనబడే సెటైర్లను ఆన్‌లైన్‌లోకి వదిలింది.
జీవీఎల్ ఎక్కడ దొరికిపోయాడంటే.. ఓ అవార్డు విషయంలో ఆయన చేసిన ట్వీట్లు సాక్షిగా పరువు పోయినంత పనైంది. ప్రధాని నరేంద్ర మోదీకి .. ఐక్యరాజ్యసమితి పురస్కారం లభించింది. యూఎన్ బహూకరించే చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును మోదీ గెలుచుకున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ సంయుక్తంగా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఫ్రాన్స్, భారత్ మధ్య సౌరశక్తిపై అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతలకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును అంతజేయడానికి యూఎన్ ఎన్విరాన్ మెంట్ హెడ్ ఎరిక్ స్లోహెమ్ ఢిల్లీ వచ్చారు. ఓ కార్యక్రమంలో అవార్డు ప్రధానం చేశారు. ఈ యూఎన్ ఎన్విరాన్ మెంట్ హెడ్ ఎరిక్ స్లోహెమ్ ను కొద్ది రోజుల కిందట… జీవీఎల్ నరసింహారావు.. ఓ ఫేక్ వ్యక్తిగా అభివర్ణించాడు. చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి ఆహ్వానం రాలేదని రచ్చ చేసే సమయంలో ఈ ఎరిక్ స్లోహెమ్ ప్రస్తావన తెచ్చి “కిళ్లి కొట్టు” అంటూ రెచ్చిపోయారు.
ఇప్పుడు అదే ఎరిక్ స్లోహెమ్ ఢిల్లీ వచ్చి మోడీకి అవార్డు అందజేశారు. దాన్ని అత్యంత గౌరవంగా మోడీ అందుకున్నారు. దానికిసంబంధించిన ఫోటోలు బయటకు రాగానే టీడీపీ నేతలు… విమర్శలు ప్రారంభించారు. కిళ్లీ కొట్టు దగ్గర మోడీ ఎందుకు అవార్డు తీసుకోవాల్సివచ్చిందని విమర్శలు గుప్పించారు. జీవీఎల్‌కు కర్మఅంటే ఏమిటో ఇప్పుడు అర్థమయి ఉంటుందేమోనని సెటైర్లు గట్టిగానే పడుతున్నయి.
Such an inspiring day in Delhi today. “We will be able to address climate climate when we make it part of our culture”, says Indian Prime Minister Narendra Modi @PMOIndia This is the secret to the country’s success! #EarthChamps pic.twitter.com/uWLMIVarJb
— Erik Solheim (@ErikSolheim) October 3, 2018
State govt has confirmed my statement that AP CM is addressing a World Economic Forum (WEF) event. Paid media of @JaiTDP is claiming that @ncbn has received rarest of honour & bluffing that this is a UN event. Here is the UN Environment Chief's reputation: https://t.co/LhzPBXN6i3
— GVL Narasimha Rao (@GVLNRAO) September 22, 2018
“India is betting on a green economy because it is the economy of well-being.” @antonioguterres at the Champions of the Earth Award ceremony in India. So pleased also to be joined by @SushmaSwaraj @maheshsharmaBJP in recognising @narendramodi and the Government of India ?? pic.twitter.com/dzbA60FE3D
— Erik Solheim (@ErikSolheim) October 3, 2018