టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు నచ్చని నేతలను… అసభ్యంగా తిట్టడంలో ముందు ఉంటారు. కొంత మంది తిరిగి తిడతారు. చాలా మంది ఆ స్థాయికి దిగజారలేమని ఊరుకుంటారు. నిజామాబాద్‌లో ఆ అసహనం చాలా తీవ్ర స్థాయిలో కనిపించింది. ” నన్ను బట్టెబాజ్ అంటారా? ఈ చెత్త కాంగ్రెసోళ్లు..? థూ .., మీ బతుకులు చెడ” అంటూ ప్రారంభించారు. ” అడుక్కుంటే ఆ నాలుగు సీట్లు నేనే పారేసేవాడిని కదా సిగ్గూశరం లేని బతుకులు థూ” అంటూ కొనసాగించారు. కేసీఆర్ నోటి వెంట అసువుగా వచ్చేసిన ఈ మాటలను చూసి చాలా మంది … మనం కల్లు కాంపౌండ్ దగ్గర ఉన్నామా ఏంది..? అని గిల్లి చూసుకుని ఉంటారు. ఉచ్చ పోస్తే కేసు పెట్టిన్రట కాంగ్రెసోళ్లు..! చెంబట్కక పోతే వాసన రాకుండా చేస్తరట బీజేపోళ్లు. కేసీఆర మాటలు అర్థమయ్యో… తమ లెక్క మాట్లాడుతున్నారని… అనుకునో చాలా మంది విజిల్స్ వేసి ఉంటారు. చప్పట్లు కొట్టి ఉంటారు.
కానీ ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి రావాల్సిన భాషేనా అది…? ఆ భాషేంది..? కొట్లాడి సాధించుకున్నా తెలంగాణలో… రాజకీయ అవసరాల కోసం.. కక్కుర్తి పడ్డ సోనియా ఇచ్చిన తెలంగాణనో కానీ..కేసీఆర్ మాత్రం.. తన గడీలెక్క దాన్ని వాడేసుకుంటున్నారు. అచ్చం దొరలానే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. నోటికి ఎంత వస్తే.. అన్నన్ని మాటలు అనేందుకు తనకు..సర్వాధికారాలు ఉన్నాయనుకుంటున్నారు. అందుకే… పద్దతి పాడూ లేకుండా.. తనకు మాత్రమే కల్లు కాంపౌండ్ లాంగ్వేజ్ వచ్చినట్లు చెలరేగిపోయారు.
ఓ ముఖ్యమంత్రి ప్రవర్తన.. ఇలా ఉంటే.. అది ఆ ముఖ్యమంత్రికి కాదు అవమానం. ఆ రాష్ట్రానికి అవమానం. తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారు కదా..అని నాలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే.. అదీ అవమానం. ఈ రోజు..సీఎం పదవిలోఉన్నవారిని.. తిరిగి కాంగ్రెస్ నేతలు.. అంత కంటేపెద్ద పదాలతో తిట్టగలరు. తిట్లు కేసీఆర్ ఒక్కటికే వచ్చినవి కాదు కదా. అయినా కేసీఆర్ తన కసిని.. కోపాన్ని దాచుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. తనకు తాను భాషా ఉద్యమం చేస్తున్నట్లు ఫీలైపోయారు.