బోయపాటి సినిమాలన్నీ మాస్ టచ్‌తో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మాసీ టైటిళ్లని పెడుతుంటారు. భద్ర, తులసి, దమ్ము, సింహ, లెజెండ్, సరైనోడు… ఇలాంటి టైటిళ్లే పోస్టర్లపై కనిపించాయి. అయితే ఈమధ్య ఈ పంథా మార్చారు. క్లాస్‌నీ ఆకట్టుకోవాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. అందులో భాగంగానే `జయ జానకీ నాయక` అనే టైటిల్‌తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం.. ఓ క్లాస్ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. అదే.. `వినయ విధేయ రామ`. నిర్మాత డీవీవీ దాయన్య ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించడంతో… ఇది బోయపాటి సినిమా కోసమే అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. చరణ్ సినిమా కోసం `స్టేట్ రౌడీ` అనే పేరు కూడా పరిశీలించారు. అయితే పాత టైటిల్‌ని గుర్తు చేయడం కంటే.. కొత్త టైటిల్ పెట్టడమే బెటర్ అని బోయపాటి ఈ టైటిల్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది.దసరా పండక్కి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవుతోంది. అప్పుడే టైటిల్‌నీ అధికారికంగా ప్రకటిస్తారు.