‘నా పేరు సూర్య’ తరవాత అల్లు అర్జున్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అయితే… చేతిలో ప్రాజెక్ట్స్ మాత్రం ఉన్నాయి. అందులో… విక్రమ్ కె.కుమార్ సినిమా ఒకటి ఉంది. ‘హలో’ తరవాత విక్రమ్ కూడా కాస్త డిఫెన్సివ్‌లో పడ్డాడు. తనకు కూడా ఓ హిట్టు కావాలి. అందుకే… స్క్రిప్టు విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. ఇది వరకు విక్రమ్ చెప్పిన కథకు ‘ఓకే’ చెప్పేసిన బన్నీ… ఇప్పుడు తాజాగా కొన్ని సవరణలు చేసినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో బన్నీకి కొన్ని డౌట్లు ఉన్నాయని, ప్రస్తుతం ఆ సవరణల్లోనే విక్రమ్ ఉన్నాడని టాక్. విక్రమ్ కథెలప్పుడూ కొత్త కోణంలో సాగుతాయి. బన్నీకీ అలాంటి కథలు చేయడమే ఇష్టం. ఆ కోణంలోనే ఆలోచించి విక్రమ్ కథ ఒప్పుకున్నాడు. అయితే.. ‘నా పేరు సూర్య’ రిజల్ట్ తరవాత బన్నీ ఆలోచనల్లో మార్పు వచ్చాయి. తనకు ఓ భారీ కమర్షియల్ హిట్ అవసరం ఏర్పడింది. విక్రమ్ చెప్పిన కథ మరీ క్లాస్‌గా ఉండడంతో… అందులో మార్పులు చేయమని అడిగాడు బన్నీ. ఆ మార్పుల కోసం విక్రమ్ మరింత సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ దృష్టి ఇప్పుడు త్రివిక్రమ్‌పై పడింది. `అరవింద సమేత` బాక్సాఫీసు దగ్గర నిలబడితే – వెంటనే త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. అరవింద రిజల్ట్ తేడా కొడితే.. విక్రమ్ ఎలానూ ఉన్నాడు కదా? అదీ బన్నీ ప్లానింగు.