ఇది చాలా పాత మేటర్. ఓ విధంగా చెప్పాలంటే `నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా` సెట్స్‌పై ఉన్నప్పుడే ఈ వార్త బయటకు వచ్చేసింది. ఆ సినిమా పూర్తవ్వగానే ఇది పట్టాలెక్కాల్సింది. తమిళంలో మార్కెట్ కోసం చూస్తున్న బన్నీ… విక్రమ్‌కి ఓ మంచి ఆప్షన్‌గా ఎంచుకున్నాడు. `సూర్య…` తరవాత పట్టాలెక్కాల్సిన సినిమా కూడా ఇదే. ఇంత వరకూ కథ గురించి కాలయాపన చేసిన బన్నీ… మొన్నటి వరకూ `సెకండాఫ్ కుదర్లేదు` అంటూ స్క్రిప్టులో మార్పులు చేర్పులూ చేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆ కథని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. తన తదుపరి సినిమా త్రివిక్రమ్‌తో ఖాయమైపోయినట్టు.. మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. `అరవింద సమేత` రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ… ఆ సినిమా బయటకు వచ్చాకే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఇద్దామనుకున్నాడు. అయితే విక్రమ్ కుమార్ కథ ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో, సెకండాఫ్‌లో ఎలాంటి సంతృప్తీ పడకపోవడంతో, విక్రమ్ సినిమా పనుల్ని ఎక్కడికక్కడ ఆపేసినట్టు సమాచారం అందుతోంది.