పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ `కోబలి` అనే సినిమా తీద్దామనుకున్నాడు. అది రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన కథ. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీసిన `అరవింద సమేత` కూడా ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగేదే. దాంతో `కోబలి` కథకే త్రివిక్రమ్ కమర్షియల్ కోటింగ్ ఇచ్చాడేమో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. వీటిపై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేశాడు. కోబలి కథ వేరని, అరవింద వేరని.. రెండింటికీ సంబంధం లేదని తేల్చేశాడు. కోబలి పూర్తిగా ఆఫ్ బీట్ చిత్రమని, పాటలు, ఫైటింగులకు చోటు లేకుండా, ప్రయోగాత్మకంగా తీద్దామనుకున్నామని, అరవింద ఓ కమర్షియల్ చిత్రమని, దాన్ని ఆ కోణంలోనే చూడాలని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. 2019 ఎన్నికల తరవాత పవన్ తో త్రివిక్రమ్ `కోబలి` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ కథ ఎప్పుడో సిద్ధమైపోయింది. పవన్ ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కించేయొచ్చు. అయితే… ఓ ఆఫ్ బీట్ చిత్రంలో పవన్‌ని ఫ్యాన్స్ చూడగలరా? అనేదే అనుమానం. దాన్ని ఈ మాటల మాంత్రికుడు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.