దేశమంతా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, సెక్సువల్ హెరాస్మెంట్ల గురించి చర్చ జరుగుతోంది. పలువురి చీకటి భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. తమను ఫలానా వ్యక్తి వేధించాడని ఎవరైనా మహిళ మీడియా ముందుకొస్తే… వాళ్ళకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. కాని ఈ రోజు ఉదయం వరకూ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ ‘మీటూ’ గురించి మీడియా మాట్లాడలేదు. ఈ మౌనానికి సమంత తెర దించారు. ‘మీటూ’ మూమెంట్‌కి మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ‘‘చాలా అంటే చాలా సంతోషంగా వుంది… మహిళలు ధైర్యాన్ని కూడదీసుకుని తాము ఎదుర్కొన్న ఘటనల గురించి, లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. కొంతమంది వ్యక్తులు, కొందరు మహిళలు కూడా మీటూ గురించి మాట్లాడుతున్న మహిళలను నిలదీస్తున్నారు. ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ‘మీటూ’ గురించి మాట్లాడుతున్న మహిళలు తాము ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడుతున్నారని తెలుసుకోండి ‘మీటూఇండియా’కి నేను మద్దతు ఇస్తున్నా’’ అని సమంత ట్వీట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ‘మీటూ’ గురించి మాట్లాడటానికి ఎవరూ ముందుకురాని ఈ తరుణంలో, ‘మీటూ’కి మద్దతు ఇచ్చిన సమంత ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
(2/2) many little girls with your voice . Thankyou . I support the #MeTooIndia movement
— Samantha (@Samanthaprabhu2) October 9, 2018
(1/2)I am so happy that more and more women are finding the strength to say #MeToo . Your bravery is commendable . I am sorry though that some people ,even other women themselves will shame and burden you with the question of proof and doubt. Just know that you are saving
— Samantha (@Samanthaprabhu2) October 9, 2018