త్రివిక్రమ్–తమన్ కాంబినేషన్ ప్రేక్షకులకు కచ్చితంగా సర్ప్రైజే! అసలు, ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. త్రివిక్రమ్ స్టైల్ వేరు. తమన్ స్టైల్ వేరు. తమన్‌తో త్రివిక్రమ్ ఎలా మ్యూజిక్ చేయించుకుంటాడోనని ఆలోచించిన వాళ్ళకి పాటలతో సమాధానం లభించింది. ‘అరవింద సమేత వీరరాఘవ’లో తమన్ స్టైల్ కంటే త్రివిక్రమ్ స్టైల్ పాటలే ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే… తమన్‌కి త్రివిక్రమ్ కొన్ని కండీషన్లు పెట్టారు.
-
1) బేసిగ్గా నీ పాటల్లో ఎక్కువ హిందీ ఉంటుంది. మన సినిమా పాటల్లో హిందీ వద్దు. ఈ సినిమాలో హిందీ కుదరదు. తెలుగు మాత్రమే ఉండాలి.
- 3) ఎన్టీఆర్ స్టార్ హీరో కాబట్టి… కచ్చితంగా ఒక డ్యాన్స్ నంబర్ ఉండాలని భయపెట్టవద్దు. ఇటువంటి భయాలు తీసేద్దాం
2) సాంగ్ అండ్ డ్యాన్స్ నంబర్లు ఉండే సినిమా కాదు. కథలో వాటికి స్కోప్ లేదు. అందువల్ల, వాటికి వెళ్ళోద్దు.
తమన్‌కి ఈ మూడు రిక్వెస్టులు చేశానని త్రివిక్రమ్ చెప్పారు. రిక్వెస్టులు అని ఆయన చెబుతున్నారు కానీ… ఇవి వింటే ఎవరైనా కండీషన్లు అంటారు కదూ!!