వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం తెలంగాణకు నిధులు విడుదల చేసి… ఏపీకి విడుదల చేయకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంలో మరోసారి బీజేపీ … ప్రజల ముందు దోషిగా నిలబడింది. అయితే.. నిధులు ఇవ్వకపోవడం తప్పేమీ కాదని… తన పార్టీని వెనుకేసుకొచ్చేందుకు తనదైన.. వాదనతో.. జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో టీవీ కెమెరాల ముందుకువచ్చారు. ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పకుండా.. కేంద్రం నుంచి.. ఏపీకి ఎన్నెన్ని నిధులు వచ్చాయో వల్లే వేశారు. చివరికి పనుల వాటా కింద .. ఏపీకి ఇచ్చిన మొత్తాన్ని కూడా… మోడీ ఉదాహంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది ఏపీకి రూ.10,575 కోట్లు వచ్చాయట. దీన్ని చూసే… ఏపీపై కేంద్రం వివక్ష చూపించడం లేదని తెలుసుకోవాలంటున్నారు.
మరి వెనుకబడిన జిల్లాల నిధుల విషయంపై ప్రశ్నిస్తే.. మాత్రం… నాకు తెలిసినంత వరకూ యూసీలు ఇవ్వలేదని… కబుర్లు చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా.. అన్ని యూసీలు ఇచ్చానని.. ఇవ్వలేదని కానీ… తప్పుడు యూసీలు ఇచ్చామని కానీ.. కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు యూసీలు ఇచ్చిన తర్వాతనే… రూ. 350కోట్లు విడుదల చేశారని.. కానీ మోడీ వద్దన్నారనే వెనక్కి తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ కేంద్రం ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. జీవీఎల్ మాత్రం బయటకు వచ్చి..” నాకు తెలిసినంత వరకు యూసీలు ఇవ్వలేదనే..” కబుర్లు చెబుతున్నారు.
జీవీఎల్ చేస్తున్న వాదనల్లో మరో వింత కూడా ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. అదేంటో.. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో.. రాష్ట్రం చెప్పడమేమిటో.. అదీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధికార ప్రతిధిగా మాత్రమే కాకుండా.. ఎంపీగా ఉండి మరీ… జీవీఎల్ ఇలాంటి లేఖ రాయడం అందర్నీ ఆశ్చర్య పరిచేదే. తను చేస్తున్నది ఏమిటో కానీ… తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలంటే కుదరదని చెబుతున్నారు. అలా చెబుతోంది జీవీఎల్లే కదా..!
My letter to the Chief Minister of AP Shri Chandrababu Naidu on how central allocations in the last two years have nearly doubled. This is stated by none other than former state Chief Secretary Shri Dinesh Kumar. I have urged CM to stop propaganda because this won't work. pic.twitter.com/5zeKp7t5BM
— GVL Narasimha Rao (@GVLNRAO) October 9, 2018