ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ కొన్నాళ్ల కిందట బలంగా ఉండేది. ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతోంది. 1999 ఎన్నికల వరకు జిల్లాలో బీజేపీ.. బలీయమైన శక్తిగా ఉండేది.2004 తరువాత సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పుడా గ్రాఫ్‌ను తిరిగి పెంచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత మహరాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే గా, ఎంపిగా పలుమార్లు గెలిచారు. కానీ ఇప్పుడు డిపాజిట్ తెచ్చుకునే నేతలు కూడా.. బీజేపీలో లేరు. అమిత్ షా మ్యాజిక్ చేస్తారని ఆశ పడుతున్న బీజేపీ నేతలు.. నేడు కరీంనగర్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్లో బండి సంజయ్, పెద్దపల్లి లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి, రామగుండంలో వనిత, వేములవాడ పతాని రామక్రిష్ణలు ఓ మాదిరిగా గుర్తింపు ున్న నేతలు. మగిలిన 9 స్థానాల్లో బలమైన పోటి ఇచ్చే నేతలు ఆ పార్టీ కరువయ్యారు. మహాకూటమి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అసంతృప్తితో ఎవరైనా బయటకు వస్తే.. వారికి బీఫాం ఇవ్వడానికి పార్టీ వర్గాలు రెడీ అయిపోయాయి. అమిత్ షా పర్యటనతో రాజకీయంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని కమలం నేతలు ఆశతో ఉన్నారు. టిఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగాలనుకుంటున్న మంథని,రామగుండం,చోప్పదండి లో నియోజక వర్గాల్లోని నేతలకు కాషాయ కండువా కప్పేందుకు చర్చలు జరుపుతున్నారు. అమిత్ షా పర్యటన తరువాత నిత్యం బిజెపి పార్టీ ప్రజల్లో ఉండడానికి కార్యచరణ సిద్దం చేసుకున్నట్లు సీనియర్ నేతలు చెప్తున్నారు. నియోజక వర్గల వారీగా నిర్వహించే సభలకు ఎవరో ఒకరు జాతీయ నాయకుడు హజరయ్యేలా చూసెందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏర్పట్లను చేస్తుంది. జాతీయ స్థాయి నేతలు హజరయ్యే సభలకు 20 నుంచి 25 వేల మంది జనం హజరయ్యేల చూడాలంటు ఇప్పటికే స్థానిక నాయకత్వలకు రాష్ట్రా పార్టీ ఆదేశాలను జారీ చేసింది.
అమితే షా పర్యటను ముందే ఉత్తర తెలంగాణ రాజకీయ పరిణామాల పై అంతర్గత సర్వేలను చేయించినట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. సర్వేల ఆధారంగానే ఉత్తర తెలంగాణలో కరీంనగర్ తో సత్తా చాటుకుంటే ఆటో మెటిక్ గా మిగితా జిల్లాలో పట్టు సాధించవచ్చనేది పార్టీ వ్యుహంగా తెలుస్తుంది. అందుకే బిజెపి టార్గెట్ కరీంనగర్ పెట్టుకోని …పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి మరి కమలానాధులు చేస్తున్న కసరత్తు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి..!