తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మూడు నెలల లోపే తెలంగాణ లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా 11వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా, ఇప్పుడు హైకోర్టు మూడు నెలల లోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో, ప్రభుత్వం వీటిపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల లోపే పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారా లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నెలలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు ప్రత్యేక అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడిన హైకోర్టు, ఈ మూడు నెలలు మాత్రం వారిని కొనసాగించుకోవచ్చు అని, ఆ వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.