కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి ఉదయం బిజెపి పార్టీలో చేరి, సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని ప్రకటించిన దరిమిలా తనకు టికెట్ రాదని భావించి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరి నట్టు చెబుతున్నారు. సంగారెడ్డి నుంచి కానీ మెదక్ నుంచి కానీ పోటీ చేయాలని ఆమె భావించినట్టు కూడా చెబుతున్నారు. అయితే ఆమె బిజెపిలో చేరగానే అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద విమర్శల దాడి మొదలెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది తయారు చేసిన వారి ఇంట్లో వాళ్లకి నచ్చలేదంటూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీని కలిపి ఎద్దేవా చేసింది.
అయితే సాయంత్రానికి ఆవిడ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకున్నానని, బిజెపిలో చేరడం అనేది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అని, ఇక మీదట కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, రాజకీయ నాయకులను ఉద్దేశించి “పూటకో పార్టీ మారుస్తారు” అంటూ పత్రికల్లో అప్పుడప్పుడు రాస్తూ ఉండేవాళ్ళు. అయితే నిజంగానే పూటకో పార్టీ మార్చిన నాయకురాలిగా దామోదర రాజనర్సింహ సతీమణి గారు రాజకీయాల్లో నిలిచిపోతారు.