మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహన్ .. జనసేనలో చేరారు. ఆయనే కాదు.. చాలా చేరికలు ఉంటాయని.. జనసేన నేతలు ప్రచారం చేస్తున్నరు. పెద్ద పెద్ద నేతలంతా తమ పార్టీలో చేరుతారని చెప్పుకొస్తున్నారు. నాదెండ్ల మనోహర్ స్పీకర్గా పని చేశారు. ఇప్పటి వరకూ ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ జనసేనలో చేరలేదు. అందువల్ల కచ్చితంగా… అది జనసేనకు ప్రయోజనమే. అయితే.. నాదెండ్ల మనోహన్ వల్ల.. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు.. జనసేన బలపడుతుందని నేనేమి చెప్పను. ఎందుకంటే.. ఆయన ఆయన నియోజకవర్గంలో కొంత ప్రాబల్యం ఉన్న నేత. జనసేనకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్న సామాజికవర్గం కాకుండా.. వేరే సామాజికవర్గానికి చెందిన నేత.
టీడీపీ, వైసీపీల్లో టిక్కెట్ లేని వాళ్లు జనసేనకి క్యూ కడుతున్నారా..?
రాజకీయ సామాజిక సమీకరణల్లో నాదెండ్ల మనోహర్ చేరిక విషయాన్ని కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ జనసేనలో… ప్రముఖ నేతలు అనే వారెవరూ చేరలేదు. అందు వల్ల జనసేనకు పొలిటికల్ ఇమేజ్ రావడానికి ఇలాంటి చేరికలు ఉపయోగపడతాయి. ఇప్పటి వరకూ రాజకీయ పరిశీలకలు.. జనసేనను.. మెయిన్ స్ట్రీమ్ పార్టీగా పరిగణించడం లేదు. 2014లో ఉన్నట్లుగానే చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన నేతలు… జనసేనలో చేరినప్పుడు.. ఏమవుతుందంటే… జనసేన కూడా.. సీరియస్గా పోటీ లో ఉంటుందనే అంచనా వేస్తుంది. లేకపోతే.. అలాంటి నేతలు ఎందుకు చేరుతారనే సందేహం వస్తుంది. జనసేనలో ఓ స్థాయి నేతలు… చేరితే… అలాంటి ఇమేజ్ వస్తుంది. ఇంకా చాలా మంది నేతలు చేరుతారని ప్రచారం చేస్తున్నారు. చేరే అవకాశం కూడా ఉంది. ప్రతి నియోజకవర్గంలో.. ప్రతీ పార్టీకి ముగ్గురు, నలుగురు టిక్కెట్లు ఆశిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వారు.. ఇతరలు… అందరూ.. టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఎవరికో ఒక్కరికే.. ఇవ్వగలరు. ఎవరికీ.. ఐదేళ్లు ఆగే ఓపిక ఉండదు. ఐదేళ్లు ఆగితే.. రాజకీయ జీవితం ఉంటుందో లేదో తెలియదు. అందుకే.. పోటీ చేసే అవకాశం ఉన్న పార్టీలో చేరిపోతారు.
ఎక్కడా అవకాశం లేకపోతే.. అవకాశం ఉన్న చోట ..!
ఉదాహరణకు వైసీపీలో యాస్పిరెంట్… టీడీపీలో చేరలేరు. అక్కడ ఆల్రెడీకి టీడీపీకి అభ్యర్థి ఉంటారు. కాంగ్రెస్లో చేరితే ప్రయోజనం ఉండదు. అంటే.. ఇక చాయిస్ ఉన్నది జనసేనలో మాత్రమేనన్నమాట. నాదెండ్ల మనోహర్ పరిస్థితే తీసుకుందాం. తెనాలిలో టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వైసీపీలో వేకెన్సి లేదు. కాంగ్రెస్ లో ఉంటే మనుగడ లేదు. అందుకే.. జనసేనలో చేరిపోయారు. అదెట్లా ఉంటుందంటే…మల్టిప్లెక్స్ లో అరవింద సమేత సినిమా చూద్దామని సతీ సమేతంగా వెళ్తే.. హౌస్ ఫుల్ బోర్డు ఉంటుంది. వచ్చాం కదా అని.. ఏదో ఒక సినిమా చూసి వెళ్తారు. ఇప్పుడు రాజకీయాలు కూడా… మల్టిఫ్లెక్స్ టైప్ అయిపోయాయి. ఒక పార్టీలో వేకెన్సీ లేకపోతే..మరో పార్టీలోకి వెళ్తారు. జనసేనకు ఈ విషయంలో కాస్తంత అడ్వాంటేజ్ ఉంది.అందుకే… టీడీపీ, వైసీపీల్లో చోటు లేని వారు.. టిక్కెట్లు దొరకని వారు… జనసేనలో చేరుతారు.
వలస నేలతో జనసేనను నింపేస్తారా..?
అయితే.. ఇక్కడా ఓ మైనస్ ఉంది. జనసేన ప్రారంభించినప్పటి నుంచి పవన్ కల్యాణ్.. కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నానని ప్రకటించారు. కానీ ఈ వలస నేతలే ఎక్కువగా ఉంటే.. ఆ ఇమేజ్ పోతుంది. వలస నేతల పార్టీగా పేరు పడిపోతుంది. పైగా ఇలా వచ్చిన నేతలు పార్టీలో ఉంటారన్న గ్యారంటీ లేదు. రేపు నాదెండ్ల మనోహర్కి టీడీపీలోనో.. వైసీపీలోనే.. టిక్కెట్ ఇస్తామని పిలిస్తే.. ఆయన వెళ్లిపోవచ్చు. వెళ్తారని నేను చెప్పడం లేదు.. కానీ సహజంగా రాజకీయాల్లో అదే జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్లు… పార్టీలో ఉంటారని చెప్పలేం. నిన్ననే… పద్మినిరెడ్డి వ్యవహారం చూశాం. ఉదమయే ప్రెస్మీట్లో..మోడీని పథకాలు చూసి.. బీజేపీలో చేరానని చెప్పారు. చెప్పిన కొద్ది గంటల్లోనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏమిటి ఈ రాజకీయాలు..? . ఏ పార్టీలో ఎవరుంటారో.. తెలియని పరిస్థితి.
రాజకీయ వ్యవస్థ మార్పు ఎలా..?
అందుకే పార్టీ పెరగాలి అంటే కన్సిస్టెంట్గా రాజకీయం చేయాలి. రాజకీయ పార్టీలు కూడా.. అంతే తయారయ్యాయి. అందుకే ప్రజలందరూ.. అందరూ దొంగలే అనుకునే పరిస్థితికి వచ్చారు. నేను శాసనమండలిలో ఎనిమిదేళ్లు ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని బ్రాహ్మండంగా డిఫెండ్ చేసిన వాళ్లు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు బ్రహ్మాండంగా.. టీడీపీని డిఫెండ్ చేసిన వాళ్లు ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. అందువల్ల ఎవరు ఏ పార్టీలో ఉన్నారో.. అర్థం కాని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. మాటకంటే.. పార్టీ మార్చి.. కార్యకర్తల మనోభావాల ప్రకారం.. పార్టీ మారుతున్నారని చెబుతున్నారు. దీని వల్ల రాజకీయ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతోంది.