అవును… విజయ్ దేవరకొండ డబ్బులు తీసుకున్నాడు. ఓ కన్నడ నిర్మాత దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అతనికి ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. నిర్మాత దగ్గర చాలా కథలు పంపిస్తున్నాడట! కానీ, అతడికి ఏవీ నచ్చకపోవడంతో సినిమా పట్టాలు ఎక్కడం లేదు. అసలు వివరాల్లోకి వెళితే… తెలుగులో ‘పవర్’, ‘ఆటగదరా శివ’, రజనీకాంత్ హీరోగా ‘లింగ’ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ‘పెళ్లి చూపులు’ సినిమా కంటే ముందు ఓ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రతించారు. అది చేయడం విజయ్ దేవరకొండకు కుదరలేదు. కానీ, ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరూ టచ్‌లో వున్నారు. విజయ్ దేవరకొండ ఇల్లు కొనుకుంటున్నప్పుడు డబ్బులు తక్కువ పడితే… రాక్‌లైన్ వెంకటేశ్‌కి కాల్ చేయగా, ఆయన పెద్ద మొత్తంలో పంపించారు. అంతకు ముందు సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు. ఎలాగైనా, సినిమా చేయాలని తనకు నచ్చిన కథలను నిర్మాత దగ్గరకు పంపించడం ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. కానీ, అవేవీ నిర్మాతకు నచ్చలేదు. నిర్మాతకు కథ నచ్చిన వెంటనే సినిమా పట్టాలు ఎక్కుతుంది. తెలుగులో మాత్రమే ఆ సినిమా వుంటుందా? తెలుగు, తమిళ భాషల్లో తీస్తారా? అనేది తరవాత విషయం! అదీ సంగతి!!