సెఫాలజిస్ట్ జీవీఎల్ నరసింహారావు… తన మాటల చాతుర్యంతో బీజేపీకి అధికార ప్రతినిధి అయ్యారు. ఆ తర్వాత యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. యూపీ నుంచి ఎంపీ అయినా.. ఆయన ధ్యాస అంతా ఏపీ మీదనే ఉంటుంది. అదేం విచిత్రమో.. కానీ.. ఏపీకి పాజిటివ్‌గా ఒక్క మాటంటే.. ఒక్క మాట మాట్లాడరు. ఏపీకి నిధులు రావాలంటే.. కుప్పలు తెప్పలుగా ఇచ్చేశామంటారు. రైల్వేజోన్ రావాలంటే… ఏపీనే వద్దన్నదంటారు. స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉందంటే.. ఏపీ ప్రభుత్వమే అడ్డు పడిదంటారు. చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి ఆహ్వానం వచ్చిందంటే.. అదంతా ఫేక్ అంటారు. ఈయన అధికార ప్రతినిధి.. మాటల చాతుర్యం ఉంది కాబట్టి… “నందిని పంది” అని నమ్మించగలనని అనుకుంటున్నారు. కళ్ల ముందు.. కనిపిస్తున్నా… అది నంది కాదు.. అని ట్విట్టర్లో అడ్డగోలుగా వాదించేస్తూ ఉంటారు. మళ్లీ దానిపై చర్చకు సిద్ధమంటారు. గతంలో ఇలాంటి చాలా టీవీ చర్చల్లో జీవీఎల్ జాతకం తెలిసిపోయినా… మళ్లీ అలాంటి సవాలే చేశారు. ఈ సారి సీఎం రమేష్ మీదకు మళ్లారు.
ఉక్కుమంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన.. టీడీపీ ఎంపీల బృందానికి సీఎం రమేష్ నేతృత్వం వహించారు. బీరేంద్రసింగ్.. టీడీపీ ఎంపీలు చెప్పిన దాన్ని విని… వారంలో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. వీరు బయటకు రాక ముందే జీవీఎల్ ట్వీట్లు ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం వల్లే… స్టీల్ ఫ్యాక్టరీ ఆలస్యమవుతోందని.. తెలుగు ఎంపీలకు… సబ్జెక్ట్ లేదన్నట్లుగా ట్వీట్ చేశారు. ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. వెంటనే జీవీఎల్ నరసింహారావు సవాల్‌ను టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ స్వీకరించారు. జీవీఎల్‌తో తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. స్థలం, సమయం చెబితే తాను రెడీగా ఉంటానని తెలిపారు. ఈ మేరకు మీడియా ముందు సవాల్ చేశారు. ట్విట్టర్లో రిప్లయ్ కూడా ఇచ్చారు. గతంలో రాజ్యసభలో… పధ్నాలుగో ఆర్థిక సంఘం.. ప్రత్యేకహోదా ఇవ్వవద్దని చెప్పిందని…జీవీఎల్ చేసిన ప్రకటనపై.. చేసిన సవాల్‌ను జీవీఎల్ గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వవద్దని… పధ్నాలుగో ఆర్థిక సంఘం చెబితే.. తాను రాజీనామాకు సిద్ధమని..లేకపోతే.. నువ్వు సిద్ధమా అని అప్పట్లో నిండు సభలో… సీఎం రమేష్ సవాల్ చేశారు. దీనికి జీవీఎల్ స్పందించలేదు. దీన్నే గుర్తు చేశారు.
జీవీఎల్‌కు ఇలాంటి సవాళ్లు చేయడం కొత్త కాదు. గతంలో.. లోకేష్ తరపున ఎవరో మంత్రి ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్… వెంటనే తొడకొట్టారు. దమ్ముంటే… బయటపెట్టు అని..సవాల్ చేశారు. దానికి జీవీఎల్.. మీడియా ముందు చెబుతా… సోషల్ మీడియా ముందు చెబుతానని.. టైం పాస్ చేశారు. ఇంత వరకూ బయటపెట్టలేదు. ఆ తరహాలో… టీడీపీ ఎంపీలతో ఎప్పుడూ ఏదో లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు. మరి ఇప్పుడైనా.. సీఎం రమేష్ సవాల్‌కు జీవీఎల్ స్పందిస్తారా..? రొటీనే అనుకుని కొత్త సవాల్ చేస్తారా..?