“కమ్యూనిస్టుల పార్టీలతో కలసి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ పార్టీలతో కలసి పోటీ చేసే అవకాశం ఉందా..?.. ఇదీ.. ఓ మీడియా ప్రతినిధి.. పవన్‌తో జరిగిన చిట్‌చాట్‌లో నేరుగా అడిగిన ప్రశ్న. దీనికి పవన్ చెప్పిన సమాధానం..” వామపక్షాలను చివరికి ఎలాగైనా చంద్రబాబు ఆకర్షిస్తారు..”. ఈ సమాధానం విని… అక్కడున్నచాలా మంది ఆశ్చర్యపోయారు. పార్టీ ప్రారంభించిన దగ్గర్నుంచి లెఫ్ట్ పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం.. ఉద్యమాలు చేస్తాం.. అని.. ఆ పార్టీలతో కలిసి.. రోడ్డెక్కిన పవన్… కలసి పోటీ చేద్దామనేసరికి.. పూర్తిగా.. ఆ పార్టీలు టీడీపీవైపు వెళ్లిపోతాయని డిసైడ్ అయ్యారు. దాన్నే బయటపెట్టారు. పవన్ మాటలను బట్టి చూస్తే.. లెఫ్ట్ పార్టీలపై .. పవన్ కల్యాణ్ కు పూర్తి స్థాయి అపనమ్మకం ఉందని తేలిపోయింది. పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడారని తెలిసిన వెంటనే… ఏపీ వామపక్ష నేతలు రామకృష్ణ, మధు.. ఉన్న పళంగా.. పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లిపోయారు. ఆయన వ్యక్తం చేసిన అనుమానాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి పవన్ తన మాటలపై వారికేం చెప్పారో తెలియదు కానీ… పవన్ అపనమ్మకం మాత్రం బాగా ఎక్స్ పోజ్ అయింది.
వాస్తవానికి మొదటి నుంచి రాజకీయాలు చూస్తున్న వారికి… లెఫ్ట్ పార్టీలు.. పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసమే.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు కానీ… ప్రతిపక్ష వైసీపీ వైపు కానీ ఆ పార్టీ ఎక్కువగా చూడలేదు. చంద్రబాబుపై ఒంటికాలితో లేచే వామపక్ష నేతలు… పవన్ తో పాటు ఉద్యమాలు చేశారు. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు పలుమార్లు.. హైదరాబాద్ ఆఫీసుకు వెళ్లినా.. తమను నిలువు కాళ్ల మీద నిలబెట్టినా.. తాము పెట్టిన సభలకు పవన్ ప్రతినిధుల్ని పంపకపోయినా.. వాళ్లు పెద్దగా ఫీలవలేదు. అది పవన్ నైజం అనుకున్నారు. చివరికి తమతోనే ఎన్నికల పోరాటానికి వస్తామనుకున్నారు. అందుకే.. మధ్యలో ఓ ప్రత్యామ్నాయ కూటమి పెడుతున్నామని.. దానికి పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ప్రకటించారు. కానీ పవన్ కల్యామ్ మాత్రం.. ఇసుమతం కూడా స్పందించలేదు. చివరికి తెలంగాణలో పొత్తు కోసం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం.. చాలా ప్రయత్నాలు చేశారు. కనీసం కలవడానికి కూడా.. పవన్ చాన్సివ్వలేదు. దాంతో ఆయన చిన్న బుచ్చుకున్నారు.
చివరికి ఎలాగైనా వారు.. చంద్రబాబు వైపు వెళ్తారని.. పవన్ కల్యాణ్ ఎందుకు అనుకున్నారో… వమపక్ష నేతలకు కూడా అర్థం కావడం లేదు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిగా.. టీడీపీ, కమ్యూనిస్టులు.. ఇతర ప్రాంతీయ పార్టీలు కలసి పని చేస్తాయి కాబట్టి.. ఏపీలో కూడా.. అదే విధంగా ఉంటుందని అనుకున్నారేమోనన్న అంచనాలున్నాయి. అయితే.. పవన్ కల్యాణ్ రాజకీయ సలహాదారులు ఇలా చెప్పి ఉంటారని… అంతిమంగా… బీజేపీ, వైసీపీలోత జనసేన పయనం ఉంటుంది కాబట్టి.. లెఫ్ట్ పార్టీలతో వీలైనంత దూరం మెయిన్‌టెయిన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా చెప్పి ఉంటారని.. కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ మాత్రం…. తనకు లెఫ్ట్ పార్టీలపై నమ్మకం లేదని నేరుగానే చెప్పేశారు.