తెలంగాణలో రాజకీయాలు శరవేరంగా మారుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ దాదాపుగా ఖరారయింది. ఈ పొత్తుల కారణంగా రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. తెలంగాణ కన్నా ఏపీ కీలకం. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పొత్తులు.. ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది…ఆసక్తికరంగా మారింది. నిజానికి.. ఇలాంటి అనుమానంతోనే.. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో టీడీపీ తటపటాయించింది. ఏపీలో కాంగ్రెస్‌తో కలవకూడదు అనుకున్నరోజుల్లో.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా టీడీపీ ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడే స్వయంగా చెప్పారు.
కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలనుకున్నారా..?
తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు .. ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం సందేహాలతోనే చాలా రోజుల పాటు.. చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. ఏం చెప్పినా… తెలుగుదేశం పార్టీ రాజకీయం ఏపీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఏపీలో నష్టం వచ్చేలా… తెలంగాణలో టీడీపీ తరపున నిర్ణయాలు తీసుకోరు. తెలుగుదేశానికి ప్రధానమైన రాష్ట్రం ఏపీ. అధికారానికి రాగల రాష్ట్రం ఏపీనే. తెలంగాణలో తెలుగుదేశం ఉంది. కానీ అధికారానికి వచ్చేంత బలం లేదు. తెలంగాణలో చంద్రబాబునాయుడు, లోకేష్ ముఖ్యమంత్రి కాలేరు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో పని చేసే మరో నాయకుడు సీఎం అవుతారేమో కానీ.. చంద్రబాబు మాత్రం కాలేరు. అయినా కూడా… కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు పొత్తుకు సిద్ధమయ్యారు. దీనికి కారణం ఏమిటంటే.. ఏపీలో.. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని అంచనాకు వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినా వెనుకాడకూడదన్న రీతిలో… కంక్లూజన్‌కు వచ్చినట్లు భావింవచచ్చు. కొత్త పొత్తులు తప్పవని.. కేబినెట్లో కూడా చెప్పినట్లు ప్రచారం జరిగింది. అలా చెప్పిన తర్వాత మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడులు వ్యతిరేకించారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి.. తెలంగాణలో పొత్తులు పెట్టుకోవచ్చు కానీ.. ఏపీలో పెట్టుకోకూడదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అందువల్ల ఏపీలో కూడా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. ఎలా ఉంటుంది..? పెట్టుకోవడంలో తప్పేముంది..?. పెట్టుకుంటే ప్రయోజనమేనన్న భావన ఉండబట్టే.. తెలంగాణలో టీడీపీకి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు వ్యూహమేనా..?
తెలంగాణలో .. కాంగ్రెస్‌తో పొత్తును టీడీపీ అధినేత.. ఓ టెస్టింగ్ టూల్‌గా ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తును తెలంగాణ ప్రజలు ఎలా రియాక్టవుతారు..? అనే దాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. ఇంకో పాయింట్ ఏమిటంటే.. కాంగ్రెస్‌తో పొత్తు ఏమిటి అన్న ప్రశ్న.. తెలంగాణలో పెద్దగా రాదు. ఎందుకంటే… తెలంగాణ ఇచ్చిన పార్టీతో… తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వరకూ ఏమిటంటే… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనలో ప్రధాన దోషి. ఏపీని కట్టుబట్టలతో నిలబెట్టారని..చంద్రబాబు ఇప్పటికీ చెబుతూంటారు. కాంగ్రెస్ పార్టీపైనే.. ప్రధానంగా.. రాష్ట్ర విభజనలో.. చంద్రబాబు దోషిగా నిలబెట్టారు. తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారన్న చర్చ సహజంగానే అక్కడ వస్తుంది. అందుకే తెలంగాణలో మహాకూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్న సమయంలోనే.. దేశంలో కూడా మహాకూటమి ఏర్పాటుకు తెలుగుదేశం కృషి చేస్తోంది.. అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అంతే కాదు.. ఎంపీలను.. కూడా యాక్టివేట్ చేశారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎదుకంటే.. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో కాంగ్రెస్ పార్టీని కలుపుకుని వెళ్తున్నామని చెప్పదల్చుకున్నారు. అందులో భాగంగానే.. తెలంగాణలో పొత్తులు పెట్టుకుంటున్నామని చెబుతున్నారు.
బీజేపీని ఓడించడానికి కలుస్తున్నామనే సమర్థనా..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసం.. కాంగ్రెస్ పార్టీతో కలవడం లేదు. దేశవ్యాప్తంగా.. బీజేపీకి వ్యతిరేకంగా.. టీడీపీ ఓ క్రియాశీలక పాత్ర పోషించదల్చుకుందని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నామని చెప్పదల్చుకున్నారు. ఈ విషయంలో టీడీపీ గత ఘటనలను ఉదాహరిస్తోంది. కాంగ్రెస్‌తో ఇప్పుడే మొదటిసారి కావడం కాదని.. గతంలో… యునైటెడ్ ఫ్రంట్ హయాంలో.. కాంగ్రెస్, టీడీపీ కలసి పని చేశాయని పదే పదే గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో మా కలయిక… ఇవాళ కాదు.. మూడు దశాబ్దాల కిందట కూడా… స్నేహం ఉందన్న వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. ఏదైనా రాజకీయా పార్టీ… మరో పార్టీని శత్రువుగా ఎంచుకోవాలి. ఆ శత్రువుపై తిరగడాల్సిన అవశక్యతను ప్రజల్లోకి చొప్పించాలి. చొప్పించిన తర్వాత ఎవరు ఎవరితో కలుస్తారనేది తర్వాతి విషయం. వీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఓ వైపు నుంచి వామపక్షాలు..మరోవైపు నుంచి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఒకప్పుడు… కాంగ్రెస్ పార్టీని శత్రువుగా నిర్ణయించి.. ప్రజల ముందు పెట్టినప్పుడు… పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కన పెట్టి.. కలసి పోటీ చేశాయి. జనతాపార్టీ కానీ.., ఆ తర్వతా నేషనల్ ఫ్రంట్ కానీ… అలానే ఏర్పడ్డాయి.
కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రజలు ఎలా స్పందిస్తారు..?
అందుకే ఇప్పుడు.. టీడీపీ… ఏపీకి నష్టం చేసిన విలన్ బీజేపీగా… ప్రొజెక్ట్ చేస్తోంది.ఈ విలన్‌ను ఓడించాల్సిన అవసరం దేశంలో ఉంది. బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం దేశంలో ఉంది. మరి ఆ విలన్ ను ఎదుర్కోవాలంటే.. ఒక్క టీడీపీ వల్లే కాదు.. అందరూ కలవాలన్నది పాయింట్. మరి రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? అనేది కాదు.. ఇవాళ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదు. రైల్వేజోన్, పోర్టు ఇవ్వడం లేదు. వీటన్నింటినీ ఇవ్వాల్సిన బీజేపీ… ఇవ్వడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్లడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీతో కలిసే… పొత్తును పాజిటివ్‌గా మార్చుకోవాలనుకుంటున్నారు. మరి పొత్తులను ప్రజలు ఆశీర్వదిస్తారా..? తిప్పికొడతారా అన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలనుంది.