వివిధ పత్రికలకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ ఎదురుదాడి ప్రారంభించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నైజీరియాలో ఉన్న ఆయన… ఇండియాకు తిరిగి రాగానే సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైరల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తనపై ఆరోపణలు చేయడం వెనుక భారీ అజెండా ఉందని ఎంజే అక్బర్ ఆరోపించారు. అంటే.. పూర్తిగా ఎదురుదాడి ప్రారంభించినట్లే.
ఎంజె అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. కానీ కేంద్రమంత్రి మేనకా గాంధీ సహా… కాంగ్రెస్ పార్టీ .. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తోంది. ఆయనపై.. వరుసగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీంతో.. రాజీనామా చేయించాలన్న ఆలోచన.. నరేంద్ర మోడీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే.. ఆయన ఇండియాకు రాగానే.. రాజీనామా చేశారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే… అనూహ్యంగా బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత.. ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నిజానికి లైంగిక వేధింపుల ఆరోపణలపై.. ఈ సమయంలో ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే.. అది కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన మచ్చ అవుతుంది. అందుకే వీలైనంతగా ఎదురు దాడి చేసి.. తీవ్రత తగ్గితే.. తప్పించుకోవచ్చన్న వ్యూహం అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే.. అక్బర్‌ను తొలగించాలనే విషయంలో కాంగ్రెస్ మాత్రమే కాదు.. ఆరెస్సెస్ కూడా.. ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే బీజేపీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అక్బర్ రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై తప్పుకున్న మూడో వ్యక్తి అవుతారు. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే ఉద్వాసనకు గురయ్యారు. అక్బర్‌కు మద్దతుగా మాట్లాడటమంటే పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుకోవడమేననే అభిప్రాయం కేంద్ర కేబినెట్లోని తోటి మంత్రుల్లోనే వ్యక్తమవుతోంది. ఆయన్ను అవమానకరంగా పంపించే అవకాశం లేదని, పార్టీకోసం పని చేయమని కోరతారని భావిస్తున్నారు.