అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ఉత్తర ప్రదేశ్ భామ లావణ్య త్రిపాఠి. సినిమాలో తన క్యూట్ అభినయంతో ప్రేక్షకులను తన మాయలో పడేసిన ఈ చిన్నది తర్వాత మంచు విష్ణు దూసుకెళ్తాలో నటించింది. ఇక ఆ సినిమా తర్వాత మనంలో అలా మెరిసి ఇలా వెళ్లింది. అయితే మనం సినిమా టైంలో అమ్మడి పరిస్థితి చూసి పాపం అందాల రాక్షసి పని కూడా అయ్యిపోయింది అనుకున్నారంతా..
అయితే మనం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు నానితో భలే భలే మగాడివోయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత వెంటనే సోగ్గాడే చిన్ని నాయనా అంటూ కింగ్ నాగార్జునతో నటించి హిట్ కొట్టేసింది. రెండు వరుస హిట్స్ తో మంచి ఫాం మీదున్న లావణ్య చేసిన సినిమా లచ్చిందేవికి ఓ లెక్కుంది. రాజమౌళి శిష్యుడు జగదీశ్ తలశిల దర్శకత్వం వహించిన ఈ సినిమా మయూఖ క్రియేషన్స్ పతాకంలో కొమ్మినేని సాయి ప్రసాద్ నిర్మించారు.
ఈ నెల 29న విడుదలవుతున్న ఈ సినిమా మీదా చాలా నమ్మకంతో ఉంది లావణ్య. తన మొదటి సినిమా హీరో నవీన్ చంద్రతో మరోసారి జతకట్టిన ఈ సినిమా అమ్మడికి హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా లేదా అని ఎదురు చూస్తుంది.. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రాజమౌళి చేతుల మీదుగా విడుదలయ్యింది. సినిమా ట్రైలర్స్, సాంగ్స్ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చేలానే ఉన్నాయి. మరి లావణ్య అనుకున్నట్టే తనకు హ్యాట్రిక్ అందుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.