అక్టోబర్ 10: శ్రీకాకుళంలో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. టిట్లీ తుపాను అరవీర భయంకరంగా దూసుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. హుదూద్ కన్నా ఎక్కువ ప్రళయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా… సర్వసన్నద్ధంగా ఉంది. శత్రువు ఎంత శక్తిమంతుడో తెలియదు.. ఎంత దారుణంగా విరుచుకుపడతాడో తెలియదు. అయినా అందుబాటులో ఉన్న యంత్రాంగంతో ప్రభుత్వం సిద్ధమైయింది.
లోకేష్ ఆన్ యాక్షన్ డే – 1
అక్టోబర్ 11 : విలయం వచ్చి వెళ్లింది. శూన్యం మిగిలింది. అన్నీ గ్రామాలే. కూడు, గుడ్డ. నీరు ఏదీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అంతా పంచాయతీరాజ్ శాఖపరిధిలోనినే. అప్పుడు నారా లోకేష్.. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లారు. ప్రళయం ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉందని… అంచనాలు వచ్చిన వెంటనే … అక్కడి నుండే అధికారులతో మాట్లాడారు. సమీక్షలు చేశారు. వెంటనే.. మిగతా కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు. వెంటనే.. ఢిల్లీ నుంచి… గన్నవరం వచ్చారు. అక్కడ్నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లిపోయారు. ఇక అక్కడే క్యాంప్.
లోకేష్ ఆన్ యాక్షన్ డే – 2
అక్టోబర్ 12 : టిట్లి తుపాను వచ్చి వెళ్తూ.. వెళ్తూ.. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నింటినీ తీసుకుపోయిందని.. లోకేష్‌కు అక్కడి పరిస్థితి చూస్తేనే అర్థమైపోయింది. వందల గ్రామాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు. ముందుగా వారికి తాగడానికి నీరు, ఆకలి తీర్చడానికి ఆహారం ఏర్పాటు చేయాలి. ముందుగా ఆ పని పురమాయించారు. హెరిటేజ్ నుంచి కూడా.. పెద్ద ఎత్తున మంచినీళ్లు, పాలు, మజ్జిగ తెప్పించి పంపిణీ చేశారు. ఈ వ్యవహారాలు చేస్తూనే.. డ్వామా కార్యాలయంలో… క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఓ బల్ల.. పది కుర్చీలు మాత్రమే ఉన్నాయి . దాన్నే టిట్లీ తుపానును ఎదుర్కొనే యుద్ధబరిగా మార్చుకుని కార్యాచరణ ప్రారంభించారు. పంచాయతీ రాజ్,గ్రామీణ నీటి సరఫరా,గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మాట్లాడారు. తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలు,పారిశుధ్యం,రోడ్ల పునరుద్ధరణ,తాగునీటి సరఫరా పై చర్చించారు. వీలైనంత త్వరగా గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగుల్ని తెప్పించారు.
సాయంత్రానికి పరిస్థితిపై అవగాహన వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారంభించారు. తక్షణం 388 ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి ప్రత్యేకమైన యంత్రాగాన్ని నియమించారు. పెద్ద పెద్ద జనరేటర్లను తెప్పించారు. తర్వాతి రోజు ఉదయానికల్లా.. అన్ని గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. 19 మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉదయానికల్లా పని చేసే సన్నాహాలు చేసుకున్నారు. జనరేటర్లు అందని గ్రామాలకు ట్యాంకర్లతో నీరు సరఫరాకు ప్లాన్ చేశారు.
లోకేష్ ఆన్ యాక్షన్ డే – 3
అక్టోబర్ 13 : టిట్లీ వచ్చి రెండు రోజులైనా… కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను మెరుగు పరిచేందుకు.. వందల మంది .. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. గ్రామాలకు విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ కాని ప్రాంతాలకు హుటాహుటిన.. జనరేటర్లను పంపారు. గ్రామాల వారీగా పరిస్థితుల్ని అంచనా వేసి.. ఉదయమే సమీక్ష చేశారు. గ్రామాల వారీగా ఉన్న సమస్యలు,చేపట్టాల్సిన కార్యక్రమాల పై ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దోమల నివారణ కు ఇతర జిల్లాల నుండి ఫాగింగ్ యంత్రాలు తెప్పించారు. అదనపు సిబ్బందినీ రప్పించారు. ఒక్క రోజులోనే.. టిట్లీ ప్రభావిత 377 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. అందుబాటులో ఉన్న అగ్నిమాపక వాహనాలు సైతం వినియోగించారు. పూడికతీత,పొదలతొలగింపు,రహదారుల పరిశుభ్రత,బ్లీచింగ్,దోమల నివారణకు ఫాగింగ్ అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించి సాయంత్రం లోపు ఒక దఫా పారిశుధ్య పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
ఆ తర్వాత .. ద్విచక్ర వాహనంపై… క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లారు. వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గ్రామాలను పరిశీలించారు. బాధితులకు ఉరటనిచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని… భరోసా ఇచ్చారు. హరిపురం,అంబుగం, లోహరిబండ,గొల్లపాలెం, మోగిలపాడు, చిన్న దున్నూరు, పెద్ద దున్నూరు,మర్రిపాడు,రట్టి వంటి మరుమూల గ్రామాలకు వెళ్లారు. గ్రామాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
లోకేష్ ఆన్ యాక్షన్ డే – 4
అక్టోబర్ 14 : గ్రామాల్లో పరిస్థితిపై క్లారిటీ రావడంతో.. ఉన్న పళంగా.. కల్పించాల్సిన మౌలిక వసతులపై లోకేష్ దృష్టి పెట్టారు. ఉదయం సాయంత్రం అధికారులతో సమావేశమై.. గ్రామాల్లో పరిస్థితులను సమీక్షించారు. తీవ్రంగా నష్టపోయిన మందస మండలానికి ఇంఛార్జ్ గా మంత్రి నారా లోకేష్ ని ముఖ్యమంత్రి నియమించారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో పడిపోయిన చెట్లు నరికే పనులు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వంతో ఆమోదింపచేశారు. మధ్యాహ్న భోజన పథకం,అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు భోజన సదుపాయం ఏర్పాటు ఉదయం ఆరు గంటల నుంచే మందస మండలంలో విస్తృతంగా పర్యటించారు. మందస మండలంలో ఉన్న 156 స్కూల్స్ ,అంగన్వాడీ కేంద్రాల్లో నిరంతరం భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. మందస మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరా ఆగకుండా జనరేటర్లు నడిపారు.
లోకేష్ ఆన్ యాక్షన్ డే -5
అక్టోబర్ 15 : ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు లోకేష్.. తన కార్యాచరణ గ్రామాల్లోనే ఉండేలా చేసుకున్నారు. తుఫాను ప్రభావిత 388 గ్రామాల్లో తాగునీటి సరఫరాను దాదాపుగా పునరుద్ధరించగలిగారు. జనరేటర్లు పూర్తి స్థాయి లో అమర్చడం వలన పనిచేస్తున్న 19 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలు ప్రరంభమయ్యాయి. ఇతర జిల్లాల నుండి మరో 130 ట్యాంకర్లు తీసుకు రావాలని నిర్ణయించారు. రేషన్ షాపుల్లో ఉచితంగా బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయల పంపిణీ ప్రారంభించారు. ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం,కిలో కందిపప్పు,లీటర్ నూనె,కిలో బంగాళాదుంపలు,కిలో ఉల్లిపాయలు, అరకిలో చెక్కర పంపిణీ చేశారు. మత్స్యకార గ్రామాల్లో కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇచ్చారు. మందస లో ఉన్న ప్రధాన పంపిణీ కేంద్రాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. విద్యుత్ సరఫరా కాని గ్రామాల విషయంలో.. అడ్డంకులపై ఎప్పటికప్పుడు.. చర్యలు తీసుకున్నారు.
లోకేష్… మంత్రిగా … వ్యవహారాలను పూర్తి స్థాయిలో సమర్థంగా చక్కబెట్టిన వైనం అధికారుల్ని సైతం ఆశ్చర్య పరిచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. క్రైసిస్ మెనేజ్మెంట్ ఎలా చేస్తారో.. అచ్చంగా అలాగే.. లోకేష్ కూడా.,. మేనేజ్ మెంట్ నైపుణ్యం చూపడంతో… టిట్లీ తుపాను.. సమర్థంగా ప్రభుత్వం ఎదుర్కోగలిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో.. ప్రజలను వంద శాతం సంతృప్తి పరచడం అసాధ్యం. కానీ… శ్రీకాకుళం వాసులు మాత్రం ప్రభుత్వ పనితీరును హర్షిస్తున్నారు. లోకేష్ పనితీరును మెచ్చుకుంటున్నారు.