ఫిదా తరవాత మరో సినిమాని పట్టాలెక్కించడానికి చాలా సమయమే తీసుకున్నాడు శేఖర్‌కమ్ముల. స్వతహాగానే.. శేఖర్ చాలా స్లో. ఏ విషయంలోనూ రాజీ పడకుండా స్క్రిప్టు రాసుకుంటుంటాడు. టేకింగ్ విషయంలోనూ ఇంతే. ఓ హిట్టొచ్చాక.. ఆ వేడిమీదే సినిమాని మొదలెట్టేయాలన్న రూల్సేం పెట్టుకోడు. ఫిదా లాంటి సూపర్ హిట్ తగిలాక కూడా.. పెద్ద హీరోల జోలికి పోవడం లేదు. ఎప్పటిలా తనదైన స్టైల్లో కొత్తవాళ్లతో ఓ సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరో ఎవరన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ఓ వారసుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నాడని అనుకుంటున్నారు. అతనెవరో కాదు… ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య తనయుడు అని సమాచారం. దాయన్య తన కుమారుడ్ని హీరో చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ కుర్రాడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. శేఖర్ కొన్ని రోజుల పాటు ఈ కుర్రాడికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, ఈ సినిమా కోసం రెడీ చేశార్ట. త్వరతోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటి సినిమాకి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి మల్టీస్టారర్‌కీ ఆయనే నిర్మాత.