కథానాయికగా ఎంత పాపులర్ అయ్యిందో తెలీదుగానీ, దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్నాక మాత్రం మరింత పాపులర్ అయిపోయింది అమలాపాల్. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. కరెంట్ ఎఫైర్స్‌పై గట్టిగానే స్పందిస్తూ.. తన అభిమాన గణాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతం అమలాపాల్ చూపు రాజకీయాలవైపు ఉన్నట్టు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దానికి బలాన్నిస్తూ తొలిసారి రాజకీయాలపై తన స్పందన తెలియజేసింది అమలాపాల్. తనకు రాజకీయాల గురించి బొత్తిగా తెలీదని, అయితే… అభిమానులు కోరుకుంటే తప్పకుండా వస్తానని ఓ క్లారిటీ ఇచ్చేసింది.
ఈమధ్య సోషల్ మీడియాలో అమలాపాల్‌కి తరచూ ఓ ప్రశ్న ఎదురవుతోంది. ‘రాజకీయాల్లోకి వస్తారా, వస్తే ఏ పార్టీలో చేరతారు?’` అని. దానికి అమల స్పందించింది. ”సమయం వస్తే ఏదైనా జరగదొచ్చు. రాజకీయాలూ అంతే. ఎప్పుడన్నది చెప్పలేను గానీ, అభిమానులు కోరుకుంటే తప్పకుండా వస్తా. అయితే ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకోలేదు. సమస్యల్ని, అన్యాయాల్ని ఎదుర్కోవడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. మంచి మనసుంటే చాలు” అంటోంది అమలాపాల్. దేశంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ దశలో పార్టీలకు సినీ గ్లామర్ అవసరమే. అమలాపాల్ ఎలాగూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి.. రాజకీయ పార్టీలేమైనా సంప్రదిస్తాయేమో చూడాలి.