గత కొంతకాలంగా అంతగా యాక్టివ్ గా లేని కత్తి మహేష్, మళ్లీ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నాడు. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విజయ్ సేతుపతి పై కత్తి మహేష్ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశాడు. చిరంజీవి ప్రతిష్టాత్మక సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విజయ్ సేతుపతి, గతంలో డబ్బింగ్ సినిమా పిజ్జా తో , తెలుగు ప్రేక్షకులలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాను గత సంవత్సరం నటించిన విక్రమ్ వేద సినిమా కూడా విజయ్ సేతుపతి ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. ఇటీవల ఆయన నటించిన 96 చిత్రం ఎన్నో ఆటంకాలను అవరోధాలను దాటి, ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ కథను నమ్మి, సినిమాటోగ్రాఫర్ ని దర్శకుడిగా మార్చి, ఈ సినిమా కోసం స్వయంగా తాను కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తీరు తమిళ ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేస్తూ, విజయ్ సేతుపతి పై ప్రశంసల వర్షం కురిపించాడు కత్తి మహేష్.
కత్తి మహేష్ విజయ్ సేతుపతి గురించి వ్రాస్తూ,”నమ్మిన స్క్రిప్టు కోసం ఒక హీరో ఏమి చేయగలడు అనడానికి విజయ్ సేతుపతి ని మించిన ఉదాహరణ ఉంటుందా అనిపిస్తుంది. 96 సినిమా స్క్రిప్టు విన్నాక. రచయిత, సినిమాటోగ్రఫర్ అయిన ప్రేమ్ కుమార్ ని. కథ చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టు మరొకరు తియ్యలేరు. కాబట్టి నువ్వే డైరెక్టర్ గా ఉండు. అని ఒకర్ని దర్శకుడిని చేయగలడు. నిర్మాతకు చెప్పి ఒప్పించగలడు. రెండు సంవత్సరాల పాటు సినిమా కొనసాగినా కమిటెడ్ గా షూటింగ్ చేయగలడు. తన మార్కెట్ వాల్యూ 5 నుంచి 7 కోట్ల మధ్య ఉన్నా, సినిమా కోసం కేవలం 3 కోట్ల రెమ్యునరేషన్ తో సరిపెట్టుకోగలడు. రిలీజ్ చేయడానికి నిర్మాతకు ఫైనాన్సర్లు అడ్డు తగులుతుంటే 4 కోట్ల (తన రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ)కు ష్యురిటీ సంతకం పెట్టి సినిమాను రిలీజ్ చేయగలడు. ఇంత కమిట్మెంట్ ఉంది కాబట్టే, అంత గౌరవం సంపాదించుకున్నాడు. ఎదురుగా పొగిడి పక్కకెళ్లి తిట్టుకునే గౌరవం కాదు. నిజంగా నిజమైన గౌరవం” అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
చిరంజీవి తదుపరి చిత్రం సైరా నరసింహారెడ్డి లోనే కాకుండా, రజినీకాంత్ తదుపరి చిత్రం పెట్టా లో కూడా విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు.