‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర చేసినప్పటి నుంచి అనసూయ డిమాండ్ పెరిగింది! ఆమెను దృష్టిలో పెట్టుకుని దర్శకులు, రచయితలు కథలు రాస్తున్నారు. అటువంటి కథల్లో ‘కథనం’ ఒకటి. రంగమ్మత్త పాత్రతో పోలిస్తే… ‘కథనం’లో అనసూయ లుక్ వైవిధ్యంగా ఉంది. ఓ విధంగా ‘క్షణం’లో ఆమె లుక్‌ని గుర్తు చేసింది. అనసూయ అభిమానులకు సర్ప్రైజ్ ఏంటంటే… ‘కథనం’లో ఒకరికి ఇద్దరు అనసూయలు వున్నార్ట! సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అవసరాల శ్రీనివాస్ మేల్ లీడ్ చేస్తున్న ఈ సినిమాలో ధనరాజ్, ‘వెన్నెల’ కిశోర్, జబర్దస్త్ బ్యాచ్ నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రానా విడుదల చేశారు. ఇంటర్నెట్లో అనసూయకు క్రేజ్ వుండటంతో ‘కథనం’ లుక్‌కి మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు సినిమాను సినిమాగా చూడాలని, మేల్ ఓరియెంటెడ్ సినిమానా? ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమానా? అని చూడకూడదని ట్విట్టర్లో ఆమె చేసిన కామెంట్స్ సినిమాకు ఎక్ట్సా పబ్లిసిటీ తీసుకొస్తోంది!!