సిక్కోలు వాసులు తుపాను దెబ్బకు సర్వం కోల్పోతే.. వారిని ఆదుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఒక్క మాటలో తేల్చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. తుపాను బాధితులకు ఉన్న పళంగా నష్టపరిహారం ఇస్తారా..? మేము ఇవ్వాలా..? అని క్వశ్చన్ చేసేశారు. అంతే కాదు.. టిట్లి కారణంగా రూ. 3,464 నష్టం వాటిల్లిందని.. ఓ నివేదిక కూడా రెడీ చేసేశారు. అదేంటి.. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది నానా తంటాలు పడి.. నష్టపోయిన వారి వివరాలు సేకరించడానికి నానా తంటాలు పడుతూంటే.. వైసీపీ నేతలు ఇలా రిపోర్ట్ ఇచ్చేశారని… అందరూ ఆశ్చర్య పడొచ్చు కానీ… అసలు విషయం ఏమింటే… వాళ్లకలా తెలిసిపోతాయంతే..! నిన్న ఉదయం టిట్లి తుపాను నష్టం అంచనాలకు.. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
ఆ కమిటీ సాయంత్రం జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఉత్తినే కాదు… నివేదికతో. నివేదికను తుపాను నష్టం గురించి.. వివరాలను జగన్ తెలుసుకుని ఆవేదనా భరితుడయ్యాడు. ప్రజలకు జరిగిన కష్టాన్ని తెలుసుకుని తల్లిఢిల్లీపోయిన ఆయన.. వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడంటే.. పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడట. పాదయాత్ర ఉద్దానంకు వచ్చిన బాధితులను స్వయంగా కలుస్తారట. తుపాను కారణంగా రూ. 3,464 కోట్ల నష్టం వాటిల్లింది కాబట్టి.. అణపైసలతో సహా.. వారికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. కేంద్రం ఇస్తుందా లేదా అని ఆలోచించకుండా… ఉన్న పళలంగా.. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామే ఇస్తామన్నారు. నిజంగా అయితే.. ఇది ప్రభుత్వానికి సంతృప్తి కలిగించే మాట.
మోడీ ఇవ్వకపోతే పోయారు.. జగన్ ఇస్తున్నారని భావించేవారు. కానీ చివర్లో షరతులాంటి పదాన్ని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అదేమిటంటే.. ఆరు నెలల్లో మేమొస్తాం.. మేము రాగానే మొత్తం ఇచ్చేస్తామన్నది ఆ షరతు. దాంతో అందరి గాలి పోయింది. అన్నట్లు.. వైసీపీ రూ. కోటి విరాళం ప్రకటించిది కదా.. అదైనా ఇస్తున్నారా.. అంటే… ఇచ్చేశాంగా అనేశారు ధర్మాన ప్రసాదరావు సింపుల్గా..! జర్నలిస్టులందరూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టడంతో… బాధితులకు.. వైసీపీ తరుపున రూ. కోటి విలువైన వస్తువులను పంపిణీ చేశామని… డిక్లేర్ చేశారు. ఇంక ఎవరు మాత్రం ఖండించగలరు.. దటీజ్ వైసీపీ..!