టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నారు. రాంగ్ రూట్లో రాష్‌గా డ్రైవింగ్ చేస్తూ…ఓ బైక్‌ను ఢీకొట్టి ప్రమాదం చేయడమే కాకుండా… ఆ తర్వాత పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లుగా… కేసు నమోదు అయింది. ఈ కేసులో సురేష్‌బాబుకు కార్ఖానా స్టేషన్ పోలీసులు 41a సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల కింద.. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సాధారణంగా.. ప్రమాదానికి గురిచేయడమే కాదు.. వారని పట్టించుకోకుండా వెళ్లడం కూడా నేరమే.
ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ దగ్గర ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా ద్విచక్ర వాహనాన్ని TS09EX2628 నెంబర్ గల లగ్జరీకారు రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారు ఆగకుండా వెళ్లిపోయింది. యాక్టివాపై ఉన్న భార్య, భర్త, చిన్నారికి గాయాలయ్యారు. వారికి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన తర్వాత… కనీస బాధ్యతగా… వారిని ఆస్పత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కారులోని వారు చేయలేదు. ఆ కారు దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీద ఉండటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు.
ఈ ప్రమాద ఘటనపై… దగ్గుబాటి సురేష్ బాబు స్పందించలేదు. కేసు TS09EX2628 నెంబర్ గల కారు నడుపుతున్న వ్యక్తిపైనే నమోదు చేశారు. కారు సురేష్బాబుది కాబట్టి… ఆయనే నడుపుతున్నట్లు భావించి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే కారును ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అన్నదానిపై పోలీసులు బయటకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కానీ సురేష్ బాబే చేస్తున్నారని.. బాధితులు పోలీసులు చెబుతున్నారు.