మంగళవారం ప్రభాస్ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజు కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. `సాహో`తో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి. రెండూ సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్.. పుట్టిన రోజు కానుకగా వస్తాయని వాళ్ల ఆశ. `సాహో` నుంచి టీజర్ వస్తుందని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. అయితే… `సాహో` టీమ్ కేవలం మేకింగ్ వీడియోతో సరిపెట్టబోతోంది. ప్రభాస్‌పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియోని విడుదల చేస్తారు. అయితే చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ పలు దశలుగా ఈ మేకింగ్ వీడియోలు విడుదల చేస్తారు. ఒక్కో కీలకమైన ఎపిసోడ్‌కి సంబంధించి ఒక్కో మేకింగ్ వీడియో అన్నమాట.
అయితే రాధాకృష్ణ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ విడుదల చేయడం లేదు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని టైటిల్స్‌ప్రచారంలో ఉన్నాయి. `జాన్` అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పుట్టిన రోజున టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తారని అనుకున్నారు. అయితే… చిత్రబృందం మాత్రం ఇంకా టైటిల్ ప్రకటన పెండింగ్‌లోనే ఉంచింది. ప్రభాస్ పుట్టిన రోజున ఎలాగూ సాహో మేకింగ్ వీడియో వస్తోంది కదా.. అని ఈ కొత్త సినిమా సంగతులు ప్రకటించకుండా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ ఈ సీజన్‌లో పండుగలు బోలెడన్ని రాబోతున్నాయి. అందుకే.. మెల్లిగా వదులుదామని యూవీ క్రియేషన్స్ భావిస్తోంది.