సాహోని ముందు నుంచీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగానే చూపిస్తూ వచ్చారు. సాహో తొలి టీజర్ గుర్తుంటే… `ఇట్స్ టైమ్ ఫన్ యాక్షన్` అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మేకింగ్ వీడియోలోనూ అదే బయటపడింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు `సాహో` ఛాప్టర్ 1 అంటూ ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ మేకింగ్ నిండా యాక్షన్ సీన్లే. దుబాయ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో ఇది. కెన్నీ బేట్స్ అనే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ వీటికి నేతృత్వం వహించాడు. హాలీవుడ్ సినిమాల్లోలాంటి కార్ ఛేజింగులు, పల్టీలు, బ్లాస్టులూ.. ఇలా ఒకటా రెండా.. యాక్షన్ మేళానే జరిగిపోయింది. ఆఖరికి శ్రద్దా కపూర్ చేత కూడా యాక్షన్ చేయించేశారు. చివరి పది సెనక్లలో ప్రభాస్ దర్శనమిచ్చాడు. స్టైలీష్‌గా… సరికొత్తగా ప్రభాస్ కనిపించాడు. బైక్ మీద రయ్యిన దూసుకెళ్లే షాట్‌తో మేకింగ్ వీడియో పూర్తయ్యింది. దుబాయ్‌లో ఈ ఫైట్ కోసం చిత్రబృందం ఎంత కష్టపడిందో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ పుట్టిన రోజుకి `సాహో` టీజర్ విడుదలైతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు ఆశపడ్డారు. అయితే టీజర్‌కి మించిన.. థ్రిల్ ఈ వీడియోలో దొరికేసింది. మొత్తానికి ప్రభాస్ పుట్టిన రోజు గిఫ్ట్ అదిరినట్టే.