మీటూ ఎఫెక్ట్ అర్జున్ పై పడింది. అర్జున్ తనని శారీకరకంగా, మానసికంగా వేధించాలని చూశాడంటూ శ్రుతిహరిహరన్ చేసిన వ్యాఖ్యలు కన్నడ సీమలో దుమారాన్ని రేపుతున్నాయి. అర్జున్‌కి ప్రతికూలంగా, అనుకూలంగా రెండు వర్గాలుగా చీలిపోయింది పరిశ్రమ. ఇప్పుడు ఖుష్బూ వంతు వచ్చింది. అర్జున్‌కి క్లీన్ చీట్ ఇచ్చింది.
”గత 35 ఏళ్లుగా అర్జున్ నాకు తెలుసు. తనతో చాలా సినిమాలు చేశాను. ఏ ఒక్కరోజూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. పైగా వందలమంది మధ్యలోకి నేను వెళ్లిన ప్రతీ సందర్భంలోనూ తను నన్ను రక్షించాడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి విమర్శలు రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అర్జున్‌ని హీరోలా చూసే తన కూతుర్లపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలి. తన నిజాయతీ నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలి. ఎవ్వరూ ఈ విషయంలో తొందరపడొద్దు” అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది ఖుష్బూ.