శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను బాధితుల్ని తక్షణం ఆదుకునేలా.. కేంద్ర ప్రభుత్వం తక్షణం.. ప్రత్యేక బృందాలను పంపాలని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు.. పార్టీ నేతలతో కలిసి… ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసి వినతి పత్రం అందించారు. మూడు రోజుల పాటు టిట్లి తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా.. తన పరిశీలనలకు వచ్చిన అంశాలను.. పవన్ తన వినతి పత్రంలో వివరించారు. ఉద్దానం ప్రాంతం మొత్తం సర్వం కోల్పోయిందని… దీన్ని జాతీయ విపత్తగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత త్వరగా కేంద్ర బృందాలు వస్తే… ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఆదుకోవడం చాలా అత్యవసరమన్నారు.
గవర్నర్ .. తమ వినతి పత్రాన్ని కేంద్రానికి పంపిస్తారని… కేంద్రం స్పందిస్తుందన్న ఆశాభావాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. ఒక వేళ కేంద్రం నుంచి స్పందన లేకపోతే… తాను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి భేటీ అవడానికి ప్రయత్నిస్తామన్నారు. తమ విజ్ఞప్తులను గవర్నర్ సానుకూలంగా విన్నారన్నారు. తుపాను దెబ్బకు ఉద్దానం ప్రజలు సర్వం కోల్పోయారని.. ఏపీ ప్రభుత్వం ఇస్తామంటున్న నష్టపరిహారం వారికి ఇంకా అందలేదని.. పైగా వారు ఇస్తున్న మొత్తం ఎంత మాత్రం ప్రజలకు సరిపోదన్నారు. ఉద్దానంలో పరిస్థితుల్ని మీడియా కూడా సరిగ్గా చూపించడం లేదన్నారు. అందువల్లే అక్కడి ప్రజలు బాధలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. గవర్నర్ స్పందనపై.. పవన కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించకపోతే… తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు.
తుపాను సహాయ చర్యల్లో విఫలమైందని ప్రభుత్వంపై .. విమర్శలు చేయడాన్ని పవన్ కల్యాణ్ సమర్థించుకున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అలాంటి విమర్శలు చేయలేదన్నారు. ప్రజల అభిప్రాయాలనే చెప్పానన్నారు. ఉద్దానంపై… తుపానుకు ముందు.. ఆ తర్వాత పరిస్థితుల్ని వివరిస్తూ… ఉండే వీడియో డాక్యుమెంటరీనికూడా.. గవర్నర్ కు ఇచ్చిన వినతి పత్రానికి.. పవన్ కల్యాణ్ జత చేశారు.