సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు త్రినాథరావు నక్కిన. రామ్‌తో తెరకెక్కించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ యావరేజ్ అనిపించుకుంది. అయితే.. వసూళ్లు బాగానే ఉన్నాయి. అందుకే త్రినాథరావుకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. త్వరలోనే వెంకటేష్‌తో కలసి ఓ సినిమా చేస్తున్నారాయన. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. డి.సురేష్ బాబు భాగస్వామిగా ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇది వెంకీ స్టైల్లో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమని సమాచారం. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలకు మాటలు అందించిన ప్రసన్న కుమార్ దీనికి కథ కూడా ఇచ్చారట. ‘ఎఫ్ 2’తో బిజీగా ఉన్న వెంకటేష్.. ఆ సినిమా పూర్తయ్యాక దీన్ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. నాగచైతన్యతో కూడా ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు వెంకీ. దాన్ని అతి త్వరలోనే మొదలెడతారు.