తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కోర్టుకు వెళ్లింది. టీటీడీపై అసత్యపు ఆరోపణలు చేశారంటూ….పరువు నష్టం క్రింద 200కోట్ల రుపాయలు టీటీడికి చెల్లించాలంటూ తిరుపతి కోర్టులో కేసు దాఖలు చేసింది. వాజ్యాన్ని స్వీకరించిన కోర్టు ఈ కేసును వచ్చే నెల 13వ తేదికి వాయిదా వేసింది. మే నెల 15వ తేదిన ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న రమణదీక్షితులు అటు టీటీడితో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.శ్రీవారికి కైంకర్యాలతో పాటు నివేదనలు సరిగా జరిపించడం లేదని,శ్రీవారి ఆభరణాలు కొన్ని మాయమయ్యాయని….గుప్త నిధుల కోసం శ్రీవారి ఆలయంలోని వకుళమాత పోటులో తవ్వకాలు జరిపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగక రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ, హైదరాబాద్ లలో పలు మార్లు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు.తర్వాత రమణదీక్షితులకు తోడుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగారు. శ్రీవారి ఆలయంలోని పోటులో తవ్వాకాలు జరిపి అక్కడి గుప్తనిధులన్నింటిని హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి తరలించారని వెంటనే తెలంగాణ,కేంద్ర బలగాలు బాబు ఇంట్లో సోదాలు జరిపితే అవి బయటపడుతాయన్నారు. లేదంటే వాటిని వెంటనే సింగపూర్ కు తరలించేస్తారంటూ ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమబద్దంగా పూజాది కార్యక్రమాలతో పాటు నివేదన కార్యక్రమాలు జరుగుతున్నా….ఆలయ పోటులో ఎలాంటి తవ్వకాలు జరగకపోయ్యినప్పటికి….శ్రీవారి ఆభరణాలని సేఫ్ గానే వున్నపట్టికి కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇరువురు టీటీడి పై ఆరోపణలను చేయ్యాడాన్ని టీటీడీ పాలకమండలి తీవ్రంగా పరిగణించింది.ఈ ఆంశం పై మూడు నెలల క్రిత్తం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించిన టీటీడీ ఇరువురి పై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది.
బోర్డు నిర్ణయం మేరకు టీటీడి న్యాయశాఖాధికారులు రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు నోటిసులు జారీ చేశారు.టీటీడి పై అసత్యపు ఆరోపణలు చేసినందుకు 15రోజులలోగా వివరణ ఇవ్వాలని లేదంటే చట్టం పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం కేసును కూడా దాఖలు చేస్తామని నోటిసులో పేర్కొన్నారు. టీటీడి నోటిసులు జారీ చేసి మూడు నెలలు గడిచిన వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బోర్డు నిర్ణయం మేరకు పరువు నష్టం దావా వేశారు. కోర్టు వారు ఇరువురికి నోటిసులు జారీ చేయ్యడంతో వారు కోర్టుకు హాజరవుతారా లేక వారి తరుపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తారో మాత్రం వేచి చూడాల్సిందే….!