నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘సవ్యసాచి’ నవంబరు 2న విడుదల అవుతోంది. ఈనెల 27న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది మైత్రీ మూవీస్ సంస్థ. సాధారణంగా చైతూ సినిమా అంటే నాగార్జున ఈవెంట్‌కి చీప్ గెస్ట్ లా హాజరవ్వడం పరిపాటి. అయితేసారి మాత్రం మరో గెస్ట్‌ని తీసుకురావాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది. చిరంజీవినిగానీ, ఎన్టీఆర్‌ని గానీ అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో గెస్ట్ ఎవరన్నది తెలుస్తుంది. ‘రంగస్థలం’ తరవాత చిరుతో మైత్రీ మూవీస్‌కి అనుబంధం పెరిగింది. చిరుతో ఓ సినిమా చేయాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది కూడా. జనతా గ్యారేజ్‌తో మైత్రీ హీరో అయిపోయాడు ఎన్టీఆర్. సో.. ఇద్దరిలో ఒకరిని ఈ వేడుకకు ఆహ్వానించాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ పరాభవంతో డీలా పడిన చైతూకి ఓ హిట్టు అత్యవసరం. ‘సవ్యసాచి’ ట్రైలర్లో హిట్టు లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి పబ్లిసిటీ కూడా తోడవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మైత్రీ మూవీస్ పబ్లిసిటీకి ఎలాంటి లోటూ చేయదు. ఇప్పటికే ప్రమోషన్లను మొదలెట్టేసింది. ప్రీ రిలీజ్‌తో దాన్ని పీక్స్‌కి తీసుకెళ్లాలన్నది ప్లాన్.