రాజమౌళి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాంక్ అయ్యే హాట్ గాసిప్ ఇది. ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎలాంటి పాత్రల్లో కనిపిప్తారు? వాళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనే విషయాల గురించి ఆరా తీస్తే.. ఓ సర్ప్రైజింగ్ విషయం తెలిసింది. ఇందులో ఎన్టీఆర్‌ని ప్రతినాయకుడిగా చూపించబోతున్నాడట రాజమౌళి. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల మధ్య పోరు.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా వీరిద్దరి వైరం మీదే తిరగబోతోందని టాక్.
ఓ శక్తిమంతమైన ప్రతినాయకుడు, వాడ్ని కొట్టి కాకలు తీరిన మొనగాడు.. ఇది రాజమౌళి సినిమా ఫార్ములా. మరోసారి అదే పంథాలో రాసుకున్న కథ ఇది. అయితే ఈసారి ప్రతినాయకుడు మరింత పవర్‌ఫుల్‌గా రాబోతున్నాడు.. ఎన్టీఆర్ రూపంలో. ప్రతినాయకుడు, కథానాయకుడు మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తులాంటి పోరే.. ఈ సినిమా. జై లవకుశలో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగానే కనిపించాడు. బహుశా.. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన.. రాజమౌళిలో ఈ కొత్త ఆలోచన రేకెత్తించి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మరింత ఫిట్‌గా తయారవ్వడానికి ఎన్టీఆర్ కసరత్తులు ప్రారంభించాడు. నవంబరు 18 నుంచి ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కబోతోంది. సినిమా మొదలెట్టే ముందే కథని చెప్పడం రాజమౌళి ఆనవాయితీ. ఈసారీ అదే పాటించి కథ చెబుతాడా? లేదంటే సిల్వర్ స్క్రీన్ పైనే చూడమంటాడా? వెయిట్ అండ్ సీ.