సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లోని ఇద్దరు ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణల విషయంలో… చీఫ్ విజిలెన్స్ కమిషన్ రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని… సుప్రీంకోర్టు ఆదేశించింది. అలోక్‌వర్మకు సంబంధించి సెక్రటేరియట్ నోట్లో పేర్కొన్న ఆరోపణలపై ఇవాల్డి నుంచి రెండు వారాల్లోగా ఎంక్వయిరీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధుల్లోంచి తమను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలోక్‌వర్మ, రాకేష్ ఆస్థానా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ ఇద్దరు సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలను… దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మొదట న్యాయస్థానం సీవీసీ దర్యాప్తునకు 10 రోజులు గడవు నిర్దేశించి, సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీవీసీ దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అయితే సోలిసిట్ జనరల్ తుషార్ మెహతా సమయం సరిపోదనన్నారు. సీవీసీ దర్యాప్తును సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో జరిపే అంశంపైనా ఆయన విభేదించారు. దర్యాప్తునకు మూడు వారాల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే జస్టిస్ రంజన్ గొగోయ్… రెండు వారాల్లోనే దర్యాప్తు ముగించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు రిటైర్జ్ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ విచారణకు ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేశారు.
సీబీఐ డైరక్టర్, స్పెషల్ డైరక్టర్లపై ఆరోపణలు వచ్చినందునే.. ఆ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ… సెలవులో పంపామని కేంద్రం వాదిస్తోంది. ఎప్పటిలోపు పూర్తవుతాయన్న విషయంపై క్లారిటీ లేదు. అలోక్ వర్మ.. పదవి కాలం పూర్తయ్యే వరకూ.. ఆయనపై దర్యాప్తు సాగుతూనే ఉంటుందని.. ఢిల్లీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే.. సుప్రీంకోర్టు తీర్పుతో… రెండు వారాల్లో ఆయనపై వచ్చిన ఆరోపణల్లో క్లారిటీ రానుంది. ఆ తర్వాత ఆయనే సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.