తమిళనాడు ప్రభుత్వానికి ఓ పెద్ద గండం తప్పినట్లు అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకుంటున్నయి. దీనికి కారణం .. దినకరన్ వర్గానికి చెందిన పద్దెనిమిది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటును హైకోర్టు సమర్థించింది. దీంతో వారందరూ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫలితంగా… తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ మారిపోయింది. ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్న కారణంగా వారు సంతోష పడుతున్నారు. కానీ కోర్టులో.. బయటపడ్డారు. కానీ.. అసలు ప్రజాకోర్టులో వారు.. పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. కోర్టులో ఊరట దక్కినందుకు సంతోషపడాలి.. ప్రజాకోర్టులో పరీక్షను ఎదుర్కోబోతున్నందుకు టెన్షన్ పడాలి.
కోర్టు తీర్పుతో తమిళనాడు ప్రభుత్వం బయటపడిందా..?
ప్రజాకోర్టులో పరీక్ష ఎందుకంటే… తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కరుణానిధి చనిపోవడం వల్ల ఖాళీ అయినది ఒకటి.. మరొకటి కూడా ఖాళీగా ఉంది. అంటే 232 సీట్లు ఉన్నాయి. డీఎంకే మిత్రపక్షాలకు కలిపి 97 సీట్లు ఉన్నాయి. అన్నాడీఎంకేకు చెందిన పద్దెనిమిది మంది దినకరన్ వర్గానికి మద్దతు ప్రకటించారు. ఆయన కూడా… జయలలిత మరణంతో ఖాళీ అయిన సీట్లో గెలిచారు. అంటే.. 19 మంది శశికళ వర్గం ఉన్నారు. అంటే.. డీఎంకే మిత్రపక్షాలకు చెందిన 97, దినకరన్ వర్గానికి చెందిన 19 మందికలిస్తే.. 116 మంది ఎమ్మెల్యేలు. అంటే… అన్నాడీఎంకే ప్రమాదంలో పడటానికి కరెక్ట్‌గా సరిపోతుంది. పళనిస్వామి వర్గానికి చెందిన ఎమ్మెల్యేనే స్పీకర్‌గా ఉండటం వల్ల శశికళ వర్గానికి చెందిన పద్దెనిమిది మందిపై అనర్హతా వేటు వేశారు. దీన్నే ఇప్పుడు కోర్టు సమర్థించింది. దీన్ని కోర్టు సమర్థించడం వల్ల ఇప్పటికిప్పుడు… ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు.. కోర్టు.. స్పీకర్ అనర్హతా వేటును సమర్థించకపోతే.. ఉన్నపళంగా.. అన్నాడీఎంకే ప్రభుత్వం మెజార్టీ కోల్పోయేది. ఎందుకంటే..ఇటీవలి కాలంలో.. అనర్హతా వేటుకు గురైన 18 మంది కాకుండా.. మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా.. మేం దినకరన్ వర్గానికే మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. అంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 120 మంది అయ్యారు. అంటే… హైకోర్టు అనర్హతా వేటును సమర్థించుకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ఉన్నట్లయితే.. తెలంగాణ ప్రభుత్వం పడిపోయేది. మధ్యంతర ఎన్నికలు వచ్చేవి. కానీ కోర్టు తీర్పుతో తప్పిపోయింది.
ఉపఎన్నికల్లో దినకరన్ వర్గం గెలిస్తే పరిస్థితి ఏమిటి..?
ఇప్పటికిప్పుడు… తమిళనాడు ప్రభుత్వానికి.. వచ్చిన ప్రమాదం లేదు. కానీ.. మొత్తంగా ఇరవై స్థానాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొత్తగా మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక వేళ ఉపఎన్నికల్లో… దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి ఉంటే.. మరికొంత మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా… దినకరన్ వైపు వస్తారు. ఎందుకంటే.. జయలలిత గెలిచిన స్థానంలో దినకరన్… ఘన విజయం సాధించారు. అంటే.. కనీసం ఇరవై సీట్లలో ఎన్నికలు జరగబోతున్నాయి… మరికొత్తగా.. దినకరన్ వైపు .. ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి.. మినీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత వచ్చింది. అవినీతిలో కూరుకుపోయింది. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వాళ్లు చెప్పినట్లు చేస్తున్నారనే ప్రచారం ఉంది. నిజానికి తమిళనాడులో బీజేపీకి అవకాశం లేదు. ద్రవిడియన్ ఫిలాసఫి ప్రకారం… హిందూత్వ రాజకీయాలకు అవకాశం లేదు. కానీ జయలలిత మరణానంతరం.. రాజకీయాల్లో … బీజేపీ కరసేవ ప్రారంభించింది. మొదట్లో శశికళను పీఠం మీద కూర్చోబెట్టకుండా ఉండటానికి చేయాల్సిందంతా చేశారు. ఓపీఎస్‌ను ప్రొత్సహించారు. వారం రోజులు.. ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేశారు. ఈ లోపు జైలుకు వెళ్లారు. అయినప్పటికీ.. పన్నీర్ సెల్వం మెజారిటీ సాధించలేదు. దీంతో… ఈపీఎస్, ఓపీఎస్ ను కలిపారు.
ఉపఎన్నికల తర్వాత ఈపీఎస్, ఓపీఎస్‌కు కేంద్రం సపోర్ట్ ఉంటుందా..?
ఈపీఎస్, ఓపీఎస్లను కలిపినప్పటికీ.. వారిద్దరూ కలిసి బలపడతారన్న నమ్మకం బీజేపీకి లేదు. అందుకే.. రజనీకాంత్‌ను కూడా రంగంలోకి దింపారు. ఆయన పార్టీని ప్రకటించారు కానీ.. కదలిక లేదు. చివరికి… టూజీ కేసును … బలహీన పరిచి.. డీఎంకేతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు… కనుక.. ఈపీఎస్, ఓపీఎస్ పతనమైన ఎన్నికలు జరిగితే.. బీజేపీ ఎవరితో అవకాశం ఉంటే వారితో పొత్తులు పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఓపీఎస్, ఈపీఎస్ నిలబడాలి అంటే.. ఇరవై స్థానాల్లో జరిగే ఉపఎన్నికల్లో.. దినకరన్ గ్రూప్ ఓడిపోతే.. ప్రభుత్వానికి ఢోకా ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. కొంత కాలం హాయిగా ఉంటారు. ఒక వేళ .. ఈ ఇరవై స్థానాల్లో గను.. 20 స్థానాల్లో గనుక దినకరన్ వర్గం గెలిస్తే.. ఈపీఎస్, ఓపీఎస్ వద్ద ఎమ్మెల్యేలు ఉండరు. అలా ఉంటే.. ఈపీఎస్, ఓపీఎస్‌లకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉండదు. ఎందుకంటే.. వీళ్లను పట్టుకుని.. బీజేపీ ఏం సాధించలేదు. అందుకే ఆ తర్వాత వీళ్ల ప్రభుత్వాన్ని కూలగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే.. ఉపఎన్నికలు తమిళనాడు మినీ అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చు.