“ప్రాంతీయ పార్టీలు మనం కలిసి నడుద్దాం… ఢిల్లీని కదిలించవచ్చని…” కేసీఆర్ను కోరానని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. బీజేపీతో లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమయ్యారని.. అందుకే … బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నందున… కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని మహాకూటమిగా బరిలోకి దిగి.. టీఆర్ఎస్ను ఓడించేందుకు పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ ఉంటారు. కొంచెం అటూ ఇటుగా.. కేటీఆర్ నోటి నుంచి ఇవే మాటలు వచ్చాయి. కాకపోతే.. ఆయన కూడా.. కలసి ఉందామని.. చెప్పారు కానీ.. రాజకీయ పార్టీగా మాత్రం.. టీడీపీ తెలంగాణలో ఉండకూడదన్నట్లుగా … హైదరాబాద్ లో సీమాంధ్రులతో జరిగిన మీటింగ్లో చెప్పుకొచ్చారు. అసలు ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ పోటీ చేయాలనుకున్నారట.. కానీ చంద్రబాబే.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారని కూడా నిష్టూరమాడారు. అసలు… ప్రజాస్వామ్యంలో.. ఓ పార్టీ… ఫలానా చోట పోటీ చేయకూడదని.. డిమాండ్ చేయడమే ఆశ్చర్యకరం. దానికి మళ్లీ సమర్థింపుగా అన్నట్లుగా.. కేటీఆర్ మాట్లాడటం మరింత ఆశ్చర్యకరం.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అయితే..మహాకూటమిలో చేరిందో.. అప్పట్నుంచి చంద్రబాబును… వ్యక్తిగతంగా కేసీఆర్ దూషించడం ప్రారంభించారు. ఆంధ్రా.. ఆంధ్రా అనే నినాదాన్ని తీవ్ర స్థాయిలో లేవనెత్తారు. దీనికి కేటీఆర్… సీమాంధ్రులకు వివరణ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు.. ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీ, చంద్రబాబును ఉద్ధేశించే మాట్లాడారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని పేర్కొన్నారు. అంతే కాదు.. సీమాంధ్ర ప్రజలకు వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని హామీలు ఇచ్చేశారు. తెలంగాణ వచ్చేంత వరకే గొడవ అని, ఈ నాలుగేళ్లలో ఎక్కడా ప్రాంతీయ వివక్ష జరగలేదని కేటీఆర్ తెలిపారు. 67 ఏళ్లలో హైదరాబాద్ ఎలా ఉండేదో.. ఈ నాలుగేళ్లలో ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునేసరికి.. కేటీఆర్ కు.. పరిస్థితులు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తున్నట్లుంది. అందుకే.. వ్యక్తిగత హోదాలో.. తానున్నానంటూ భరోసాల వరకూ వచ్చేశారు. కానీ రాజకీయ అవసరాల కోసం.. ఎప్పటికప్పుడు.. ప్లేటు ఫిరాయించే రాజకీయం.. హైదరాబాద్లోని సీమాంధ్రులు చూశారు.
హైదరాబాద్ సీమాంధ్రుల విషయంలో కేటీఆర్ పరేషాన్ కావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనుకోవచ్చు. ఓటుకు నోటు కేసు తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేసే ప్రయత్నాన్ని.. కేసీఆర్ ఓ మిషన్లా నడిపారు. ఆ దెబ్బకు.. నికరంగా ఒక్క సండ్ర వెంకట వీరయ్య మినహా ఇంకెవరూ మిగల్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అసలు ఉండలేదు. వాళ్లపై ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయో.. కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది. ఈ కారణంగా.. టీడీపీ క్యాడర్ అంతా.. తలోదిక్కు అయిపోయింది. అనూహ్యంగా.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తూండటంతో.. మళ్లీ హైదరాబాద్లోని సీమాంధ్ర ఓటర్లు సమీకృతమవుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్కు సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్.. టీడీపీ ఓటు బ్యాంక్ కలిస్తే… టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే కేటీఆర్… వ్యక్తిగత హోదాలో… తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. కానీ.. రేపు.. హైదరాబాద్లో… తెలంగాణ, సీమాంధ్రుల వాసుల మధ్య ఏదైనా పంచాయతీ వస్తే కేటీఆర్ ఎవరి వైపు ఉంటారు…? సహజంగా ఆయన తెలంగాణ వైపే ఉంటారు. మరి వ్యక్తిగతంగా ఇచ్చే భరోసాలతో ఏం ఉపయోగం ఉంటుంది..?