అదేమిటో కానీ.. చంద్రబాబు పేరు చెప్పి… తెలంగాణ ప్రజల్ని భయపెట్టాలని..టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అలా అనుకుంటోంది కానీ..నిజానికి టీఆర్ఎస్ భయపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు సర్వే చేశారంటూ… ముగ్గర్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు వాళ్లు.. పోలీసులా.. కాదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు తెలంగాణలో ఉండటమే మహా నేరమన్నట్లుగా… టీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల అధికారులు కూడా అలాగే ఉన్నారు. ఇంటలిజెన్స్ పోలీసులు… తెలంగాణలో సర్వేలు చేశారన్న కారణంగా..టీఆర్ఎస్ ఫిర్యాదులు సాకుగా చూపి.. ఏపీ నుంచి భద్రత కోసం బలగాలను వద్దనుకుంటున్నారట.
సర్వేలు చేస్తూ.. ఎవరో ముగ్గురు దొరికితే.. వారిని ఇంటలిజెన్స్ పోలీసులుగా ప్రకటించిన కేటీఆర్… ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. వారు డబ్బులు పంచుతూ దొరికారని ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న ఎన్నికల అధికారి రజత్ కుమార్ .. పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీకి నోటీసులు పంపారు. అక్కడ్నుంచి ఇంకా.. తెలంగాణ ఈసీకి నివేదిక రాలేదు. ఈ కారణంగా.. ఏపీకి చెందిన పోలీస్ బలగాలను తెలంగాణ ఎన్నికల్లో వినియోగించకూడదని నిర్ణయించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అన్ని రాష్ట్రా ల నుండి హోంగార్డులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటామని ప్రకటించారు. కానీ ఏపీ బలగాలను మాత్రం వినియోగించుకోబోమన్నారు.
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన బలగాలన్నీ…టీడీపీ అధినేత మాట వింటాయనుకోవడ అమాయకత్వం. ఒక వేళ.. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తాయనుకున్నా… ఆయన చెప్పినట్లు.. ఓటింగ్ వ్యవహారాల్లోనో.. మరో పోలింగ్ వ్యవహారాల్లో పాలు పంచుకుంటారనుకోవడం కూడా అమాయకత్వమే. అలా అయితే.. కేసీఆర్ అధీనంలో ఉన్న పోలీసు బలగాలు ఎలా ప్రవర్తించాలి..! ఏవో అపోహలు.. మరిన్ని ఆరోపణలు.. ఇంకెన్నో ఒత్తిళ్లతో…తెలంగాణ ఎన్నికల సంఘం… బలగాల విషయంలో అసహజంగా ప్రవర్తిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.